https://oktelugu.com/

PAN-Aadhaar Link: పాన్ కార్డు పనిచేయడం లేదా? అయితే ఈ చెల్లింపులకు బ్రేక్..

బ్యాంకుల్లో ఆర్థిక వ్యవహారాలు నడిపేవారు తప్పకుండా పాన్ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. పర్మినెంట్ అకౌంట్ నెంబర్ అయిన దీనితోనే ఇప్పుడు ప్రతీ ఒక్క లావాదేవీలు జరుగుతున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : July 10, 2023 / 06:11 PM IST

    PAN-Aadhaar Link

    Follow us on

    PAN-Aadhaar Link: ఆర్థిక వ్యవహారాల్లో పాన్ కార్డు ఇప్పుడు తప్పని సరి. బ్యాంకుల్లో అకౌంట్ తీయాలన్నా, రూ.50 వేలు డిపాజిట్ చేయాలన్న ఇది ఉంటేనే సాధ్యమవుతుంది. పాన్ కార్డుతో ఆధార్ ను కూడా లింగ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో చాలా మంది పాన్ కార్డును తీసుకుంటున్నారు. అయితే పాన్ కార్డు జీవితంలో ఒకేసారి వస్తుంది. మరోసారి దీనిని ఇవ్వరు. అందువల్ల పాన్ కార్డును జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇందులో ఏదైనా మార్పులు చేయాలన్నా పాత కార్డు ఉంటేనే చేస్తారు.అయినా దురదృష్టవశాత్తూ పాన్ కోల్పోతే ఎలా? అనేది చాలా మందికి సందేహం ఉంది. అంతేకాకుండా పాన్ కార్డు మిస్సయితే అసలేం జరుగుతుంది? ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిలిచిపోతాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

    బ్యాంకుల్లో ఆర్థిక వ్యవహారాలు నడిపేవారు తప్పకుండా పాన్ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. పర్మినెంట్ అకౌంట్ నెంబర్ అయిన దీనితోనే ఇప్పుడు ప్రతీ ఒక్క లావాదేవీలు జరుగుతున్నాయి. భారత ఆదాయాపు పన్ను చట్టం 1961 సెక్షన్ 139 ఏఏ ప్రకారం పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. 2023 జూన్ 30 వరకు గడువు విధించింది. ఇప్పుడు ఆ గడువు తీరడంతో పాన్ కార్డు ను ఆధార్ కార్డుతో లింక్ చేసుకోనివారికి పనిచేయడం కష్టమే అని కొందరు ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ సమయంలో ఎలాంటి లావాదేవీలు ఆగిపోతాయి? అనేది చూద్దాం..

    బ్యాంకులో కొత్త అకౌంట్ తీయడానికి గతంలో ఆధార్ లేదా ఐడెంటిటీ ఫ్రూవ్ ఏదైనా అడిగేవారు. కానీ ఇప్పుడు పాన్ కార్డు తప్పనిసరి అంటున్నారు. అయితే మీ దగ్గర పాన్ కార్డు ఉన్నా.. అదిపనిచేయనట్లయితే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ కాదు. ఏదైనా చెల్లింపులు చేసేటప్పుడు.. రూ.50 వేల కంటే ఎక్కువ ఇవ్వాల్సి వచ్చినప్పుడు పాన్ తప్పనిసరిగా అడుగుతారు. ఆ సమయంలో లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశీ ప్రయాణం చేసేవారు, విదేశీ కరెన్సీని కొనుగోలు చేసేవారికి తప్పనిసరిగా పాన్ యాక్టివ్ గా ఉండాలి.

    డిబెంజర్లు, బాండ్లను కొనుగోలు చేయడానికి, ఆర్బీఐ బాండ్లను పొందడానికి పాన్ అడుగుతారు. అయితే రూ.50 వేలు మించితేనే పాన్ చూపించాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు, బ్యాంక్ డ్రాప్ట్, పే ఆర్డర్ లేదా చెక్ ద్వారా పేమెంట్ చేసినట్లయితే పాన్ నెంబర్ వేయాల్సి ఉంటుంది.జీవిత బీమా చెల్లించాలన్న పాన్ ఉంచుకోవాలి. రూ. లక్షకు మించి సెక్యూరిటీల అమ్మకం, కొనుగోలు చేసేటప్పుడు ఇది తప్పనిసరిగా ఉండాలి. అయితే ఏ చెల్లింపులోనైనా రూ.50 వేలు మించితేనే పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.