Pakistan Praying India Win: ఓడలు బండ్లవుతాయి బండ్లు ఓడలవుతారు. ఒక్కోసారి శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. సమయం వచ్చిందంటే మిత్రులు కూడా శత్రువులుగా మారతారనడానికి ఇదే నిదర్శనం. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఎన్ని యుద్ధాలు నడిచినా ప్రస్తుతం మాత్రం పాకిస్తాన్ ప్రజలు టీ20 ప్రపంచ కప్ లో గెలవాలని కోరుకుంటున్నారు. దీంతో పాక్ ఆశలు తీరుతాయా? ఇండియా విజయం సాధిస్తుందా అని అందరిలో ఎన్నో రకాల అనుమానాలు వస్తున్నాయి. పాకిస్తాన్ అభిమానులు మాత్రం భారత్ గెలుపును కోరుకుంటున్నారు.

పాకిస్తాన్ ఇండియా, జింబాబ్వేలతో జరిగిన మ్యాచుల్లో ఓటమి పాలు కావడంతో ఇక దానికి చావో రేవో అనే సందర్భం ఏర్పడింది. పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే ఇండియా మ్యాచులన్ని గెలిస్తే దానికి దారి దొరుకుతుంది. అందుకే ఇండియా మ్యాచులు గెలవాలని కోరుకుంటోంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇండియా తప్పకుండా మ్యాచులు గెలవాలని ఆశిస్తున్నారు. దీంతో ఇండియాపై పాక్ కు ప్రేమ పుట్టుకొచ్చింది. భారత్ గెలిస్తేనే తమకు మనుగడ ఉంటుందని మనదేశం గెలవాలని మనసారా కోరుకుంటున్నారు.
పాక్ సెమీస్ కు చేరాలంటే ఇంకా మూడు మ్యాచ్ లు నెగ్గాల్సి ఉంది. అవి దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్ లపై విజయం సాధిస్తేనే సెమీస్ కు చేరే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇండియా కూడా అన్ని మ్యాచ్ ల్లో గెలిస్తే ఫలితం వస్తుంది. జింబాబ్వే, దక్షిణాఫ్రికా ఆడబోయే మ్యాచుల్లో చెరో ఒక మ్యాచ్ లో విజయం సాధిస్తే పాక్ కు అదృష్టం వరిస్తుంది. ఈ క్రమంలో పాక్ ఆశలు తీరుతాయా? సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయా? అనేది సంశయమే. దీంతో పాక్ తన గోతిని తానే తవ్వుకుంది.

ఇలా జరిగితే భారత్ 10 పాయింట్లు, పాక్ 6 పాయింట్లతో సెమీస్ కు చేరుతాయి. టీ20 వరల్డ్ కప్ లో గత ఏడాది మన ఆశలపై నీళ్లు చల్లిన పాక్ ఈసారి తనకు నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో మన జట్టు గెలవాలని కోరుకోవడం దాని స్వార్థమే తప్ప మన మీద ప్రేమతో కాదని తెలిసిందే. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం ఆ దేశానికి అలవాటే. అందుకే ఇప్పుడు మనతో దానికి ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశంతో మన జట్టు విజయం సాధించాలని ఆశిస్తోంది. పాక్ అంటే గోడ మీది పిల్లి ఎటు వైపు అయితే అటే దూకుతుందనడంలో సందేహం లేదు.