Oxygen Facial Treatment: అందానికి అమ్మాయిలు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అందరిలో అందంగా కనిపించాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆహారంలో కొన్ని రకాల పదార్థాలు చేర్చుకుంటారు. వీటివల్ల తొందరగా ముసలితనం రాకుండా యంగ్ లుక్‌లో కనిపిస్తారని భావిస్తారు. అందంగా ఉండాలంటే ఫుడ్ అనేది తప్పనిసరి. పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉండే ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల కేవలం అందం మాత్రమే పెరగడంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఏదో విధంగా డైలీ పోషకాలు ఉండే ఆహారాలను తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఇప్పుడున్న రోజుల్లో అందాన్ని పెంచుకోవడం కోసం ఎక్కువగా బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ఈ క్రమంలో బ్యూటీ పార్లర్‌కే ఎక్కువగా డబ్బు వెచ్చిస్తారు. రకరకాల ఫేషియల్స్ అంటూ డబ్బును ఖర్చు పెడుతుంటారు. అయితే సెలబ్రిటీలు యంగ్ లుక్‌లో ఉండాలని ఎక్కువగా ఆక్సిజన్ ఫేషియల్ చేయించుకుంటారు. అసలు ఆక్సిజన్ ఫేషియల్ అంటే ఏంటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆక్సిజన్ ఫేషియల్ అనేది ఒక యాంటీ ఏజింగ్ చికిత్సలు. ఆక్సిజన్ అనేది ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. అలాంటి ఆక్సిజన్ చర్మ కణాలకు ఎక్కువగా దొరికితే ముఖం కాంతివంతంగా ఉంటుంది. చర్మంపై ఎలాంటి ముడతలు, మచ్చలు లేకుండా అందంగా ఉండటానికి ఆక్సిజన్ ఫేషియల్స్ చేస్తారు. వీటివల్ల రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. దీంతో కొల్లాజిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల ముఖంపై ముడతలు, మచ్చలు వంటివి రాకుండా యంగ్ లుక్‌లో కనిపిస్తారు. ఈ ఫేషియల్ ఎక్కువగా సెలబ్రిటీలు చేయించుకుంటారు. దీనివల్ల తొందరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉంటాయి. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఎలాంటి మొటిమలు, మచ్చలు రాకుండా ఫేస్ మెరిసిపోతుంది. అయితే ఈ ఆక్సిజన్ ఫేషియల్ ధర రూ.5000 నుంచి ప్రారంభం అవుతుంది. మన దేశంలో అయితే దాదాపుగా రూ.20000 వరకు ఉంది.
ఈ ఆక్సిజన్ ఫేషియల్‌ను సెషన్లగా చేస్తారు. కనీసం ఐదు నుంచి ఆరు సెషన్లు చేయడం వల్ల ఫేస్ కాంతివంతంగా ఉంటుంది. ఈ ఫేషియల్ చేయడం వల్ల ముఖంపై ఉన్న దుమ్ము, ధూళి, మృత కణాలు అన్ని కూడా తొలగిపోతాయి. మొదటిగా ముఖాన్ని క్లెన్సర్ సాయంతో క్లీన్ చేస్తారు. ఆ తర్వాత ముఖానికి సీరం రాసి ఆక్సిజన్‌ను ముఖంపై స్టీమ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల అవి ఎక్కువగా ఆక్సిజన్‌ను పీల్చుకుంటాయి. దీనివల్ల ముఖం కాంతివంతంగా ఉంటుంది. ముఖంపై ఉండే ముడతలు అన్ని తొలగి పోయి మీరు యంగ్ లుక్‌లో కనిపిస్తారు. ఈ ఫేషియల్‌ను ఎక్కువగా సెలబ్రిటీలు చేయించుకుంటారు. ఇందులో రకాల బట్టి ధరలు ఉంటాయి. మీరు చేయించుకునే ధర బట్టి ఆ ట్రీట్మెంట్ పనిచేస్తుంది. ఎక్కువ ధర ఆక్సిజన్ ఫేషియల్ చేయించుకుంటే మీ ముఖం చాలా రోజులు కాంతివంతంగా ఉంటుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.