https://oktelugu.com/

Oatzempic Drink: నెట్టింట్ ట్రెండ్ అవుతున్న ఓట్జెంపిక్ డ్రింక్.. అసలు దీని ప్రయోజనాలేంటి?

ఓట్స్‌తో తయారు చేసే ఓట్జెంపిక్ డ్రింక్‌ను డైలీ తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారట. మరి ఈ డ్రింక్‌ను ఎలా తయారు చేస్తారు? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 12, 2024 / 03:58 AM IST

    Oatzempic Drink

    Follow us on

    Oatzempic Drink: జనరేషన్ మారుతున్న కొలది ఆహార విషయంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. కొత్త కొత్త రకాల ఆహారాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటికి తోడు సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొత్త ఫుడ్స్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో రకాల పద్ధతులు పాటిస్తున్నారు. డిటాక్స్ డ్రింక్స్ తాగడం, పోషకాలు ఉండే చియా సీడ్స్ పుడ్డింగ్ తినడం ఇలా ఒకటేంటి.. రకరకాల వాటిని తింటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో నెట్టింట ఓట్జెంపిక్ డ్రింక్ ఒకటి ట్రెండ్ అవుతుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది ఈ డ్రింక్‌ను తాగుతున్నారు. అసలు ఈ డ్రింక్ దేనితో తయారు చేస్తారు? ఈ డ్రింక్ అంటే ఏంటి? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటని చాలా మందికి సందేహం ఉంది. ఈ ఓట్జెంపిక్ డ్రింక్‌ను ఓట్స్‌తో తయారు చేస్తారు. దీన్ని డైలీ తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారట. మరి ఈ డ్రింక్‌ను ఎలా తయారు చేస్తారు? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    ఎలా తయారు చేస్తారంటే?
    మీకు నచ్చిన ఓట్స్‌ను ఒక కప్ తీసుకోవాలి. వీటిని కాస్త రోస్ట్ చేయాలి. ఆ తర్వాత ఇందులో కాస్త నీరు, నిమ్మరసం, అవసరమైతే పాలు కలిపి మిక్సీ చేయాలి. అంతే ఇక ఓట్జెంపిక్ డ్రింక్ రెడీ. మీకు కావాలంటే తేనె, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి వేసుకుని కూడా తాగవచ్చు.

    దీని ప్రయోజనాలు ఏంటంటే?
    ఓట్స్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఉదయం పూట ఈ డ్రింక్‌ను తాగడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు తగ్గడంతో పాటు ఈజీగా బరువు కూడా తగ్గుతారు. ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మలబద్ధకం, జీర్ణ సమస్యల నుంచి విముక్తి కలిగేలా చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఈ డ్రింక్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని పోషకాలు వల్ల ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. దీంతో తక్కువగా ఫుడ్ తీసుకుంటారు. అయితే ఇలా సోషల్ మీడియాలో వైరల్ అయిన అన్ని డ్రింక్‌లను ఫాలో కాకుడదని కొందరు అంటున్నారు. ఎందుకంటే ఓట్స్‌లో కేవలం ఫైబర్, కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. ఇవి ఒక్కటే శరీర ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. సాధారణంగా ఓట్స్ ఆరోగ్యానికి మంచివే. కానీ కేవలం ఇవే చాలు ఆరోగ్య ప్రయోజనాలకు అంటే నమ్మలేమని అంటున్నారు. సోషల్ మీడియాలో రోజూ ఏదో వీడియో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఇలా అయిన ప్రతీ ఫుడ్‌ను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఫుడ్‌ తీసుకునే ముందు తప్పకుండా వైద్యుల సూచనలు తీసుకోవాలి. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.