https://oktelugu.com/

Orange Juice: ఉదయాన్నే ఆరెంజ్ జ్యూస్ తాగితే ఎన్ని ప్రయోజనాలో?

రోజూ ఉదయం పూట గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగితే ఎలాంటి నీరసం లేకుండా యాక్టివ్‌గా ఉంటారట. ఆరెంజ్ జ్యూస్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 12, 2024 / 06:21 AM IST

    orange juice

    Follow us on

    Orange Juice: రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం పూట అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి. మనం తీసుకునే ఫుడ్ బట్టి నీరసం లేకుండా రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. పోషకాలు, విటమిన్లు ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఫిట్‌గా కూడా ఉంటారు. అయితే చాలా మంది ఉదయం పూట ఎక్కువగా జ్యూస్‌లు తాగుతుంటారు. ముఖ్యంగా క్యారెట్, బీట్‌రూట్ వంటి జ్యూస్‌‌లు తాగుతారు. అయితే కొన్ని జ్యూస్‌ల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయిని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదయం పూట ఆరెంజ్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం పూట గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగితే ఎలాంటి నీరసం లేకుండా యాక్టివ్‌గా ఉంటారట. ఆరెంజ్ జ్యూస్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి.

    ‌బరువు నియంత్రణలో ఉంటుంది
    ఉదయం పూట గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఇందులో చక్కెర లేకపోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. కొందరు టేస్ట్‌ కోసం చక్కెర వేస్తారు. కానీ చక్కెర లేకుండా తాగడమే ఆరోగ్యానికి మంచిది. అలాగే జీర్ణక్రియ కూడా సక్రమంగా పనిచేస్తుంది.

    రోగనిరోధక శక్తి పెరుగుతుంది
    ఆరెంజ్ జ్యూస్‌లో ఆరోగ్యకరమైన విటమిన్లు, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగు పడటంతో బాగా ఉపయోగపడతాయి. అలాగే ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వీటితో పాటు జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లను కూడా తగ్గించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది.

    గుండె ఆరోగ్యం
    రోజూ ఉదయం నారింజ రసం తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇందులో అధికంగా లిపోప్రొటీన్ అనే కొలెస్ట్రాల్‌ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేసే కొలెస్ట్రాల్. ఇది శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో పొటాషియం మెండుగా ఉంటుంది. ఇది గుండె ప్రమాదాలు రాకుండా కాపాడటంలో ప్రధాన పాత్ర వహిస్తుంది.

    చర్మ ఆరోగ్యం
    ఆరెంజ్ రసంలో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో నారింజలు బాగా ఉపయోగపడతాయి. తొందరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా యవ్వనంగా ఉండేలా చేస్తుంది. అలాగే చర్మ రంగును మార్చడంతోపాటు డార్క్ స్పాట్స్‌ను కూడా తగ్గిస్తుంది. ఇందులోని కొల్లాజెన్ చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. ముఖంపై ముడతలు, మొటిమలు రాకుండా చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

    మెదడు ఆరోగ్యం
    రోజూ ఉదయం పూట గ్లాసు నారింజ రసం తాగడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ప్లేవనాయిడ్స్ అధకంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచేలా చేస్తుంది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.