https://oktelugu.com/

Onions: ఉల్లిపాయలను ఇలా ఉపయోగిస్తున్నారా.. మీ ప్రాణాలు ఇక గాల్లోకే..

చలికాలంలో అయితే వెల్లుల్లి ఎంతో ఉపయోగపడుతుంది. కానీ చాలా మంది ఉల్లిపాయ, వెల్లుల్లిని ఇష్టమొచ్చినట్లు వండుతుంటారు. దీన్ని సరైన పద్ధతిలో వంట చేస్తే ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయి. లేకపోతే శరీరానికి అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 6, 2025 / 03:20 AM IST

    Onions

    Follow us on

    Onions: ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సామెత గురించి అందరికీ తెలిసిందే. ఉల్లి కూరల్లో వంటల్లో టేస్ట్ ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇందులోని పోషకాలు అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. ప్రతీ ఒక్కరి ఇంట్లో కూడా ఉల్లిపాయలు తప్పనిసరిగా ఉంటాయి. వీటిని కేజీల కొద్దీ ఇంట్లో స్టాక్ ఉంచుకుంటారు. కొందరు వీటిని పచ్చిగా తింటే మరికొందరు వంటల్లో ఉపయోగించి తింటారు. అయితే కేవలం ఉల్లిపాయనే కాకుండా వెల్లుల్లిని కూడా కొందరు పచ్చిగా తింటారు. ఇందులోని పోషకాలు అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో అయితే వెల్లుల్లి ఎంతో ఉపయోగపడుతుంది. కానీ చాలా మంది ఉల్లిపాయ, వెల్లుల్లిని ఇష్టమొచ్చినట్లు వండుతుంటారు. దీన్ని సరైన పద్ధతిలో వంట చేస్తే ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయి. లేకపోతే శరీరానికి అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు. కొందరు ఉల్లిపాయను గంటల తరబడి ఎక్కువగా వేయిస్తుంటారు. ఇలా వేయించడం వల్ల అందులోని పోషకాలు తొలగిపోతాయి. వాటి నుంచి అధిక సల్ఫర్ విడుదల అవుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఉల్లి, వెల్లుల్లిని ఎంత సమయం వేయించాలి? ఎక్కువ సమయం వేయించితే కలిగే నష్టాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

    ఉల్లిపాయల్లో ఎక్కువగా సల్ఫర్ ఉంటుంది. సాధారణంగా ఇది ఆరోగ్యానికి మంచిదే. కానీ సల్ఫర్‌ను అధికంగా వేయించడం వల్ల అది అసంతృప్త కొవ్వు ఆమ్లాలుగా మారుతాయి. ముఖ్యంగా ఉల్లిపాయలను నూనెలో వేయించినప్పుడు ఎక్కువగా సల్ఫర్ విడుదల అవుతుంది. అయితే ఉల్లిపాయలను 140 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర ఉల్లిపాయలను వేయించవచ్చు. కానీ అంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రతల దగ్గర ఉల్లిపాయలను వేడి చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ట్రాన్స్ ఫ్యాట్ కాలేయం, రక్తంలో తేలుతూ ఉంటుంది. దీనివల్ల బాడీలో కూడా కొవ్వు అధికంగా ఉంటుంది. దీంతో కొలెస్ట్రాల్ రక్తనాళాలను అడ్డుకోవడం వల్ల గుండెపై ఎక్కువగా భారం పడుతుంది. దీనివల్ల గుండె పోటు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయలను బాగా నూనెలో వేయించడం వల్ల శరీర భాగాలకు రక్తం సరఫరా కాదు. దీంతో ఇది గుండెపోటుకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతీ ఏడాది దాదాపుగా 2 లక్షల 70 వేల మంది కేవలం ట్రాన్స్ ఫ్యాట్ కారణంగా మరణిస్తున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే గుండె సమస్యలు తప్పవు. కాబట్టి ఎక్కువగా ఫ్యాట్ ఉండే పదార్థాలను అసలు తీసుకోవద్దు. ఎక్కువ నూనె పదార్థాలు తినడం వల్ల కడుపులో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే నూనెలో ఉల్లిపాయలను కేవలం 100 డిగ్రీల ఉష్ణోగ్రతల కంటే తక్కువగా వేయించాలని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉల్లి, వెల్లుల్లిని చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే వేయించడం అలవాటు చేసుకోండి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.