Obesity:మారుతున్న జీవనశైలి వల్ల ఈ రోజుల్లో యువత ఊబకాయం బారిన పడుతుంది. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ వంటివి తినడం.. కంప్యూటర్ల ముందు అలా కూర్చోవడం.. కానీ శారీరక శ్రమ లేకపోవడం వల్ల యువత ఎక్కువగా ఊబకాయం బారిన పడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. ఇలా ఊబకాయం బారిన పడిన తర్వాత బరువు తగ్గాలని డైట్ ఫాలో కావడం, జిమ్‌కి వెళ్లడం, వాకింగ్, రన్నింగ్ వంటివి చేస్తారు. ఇలా నియమాలు పాటించడంతో పాటు జంగ్ ఫుడ్ కూడా తింటుంటారు. ఇంకా బరువు తగ్గకుండా పెరుగుతూనే ఉంటారు. ఈరోజుల్లో ఇలాంటి ఫుడ్ తినడం వల్లే చాలా మంది తొందరగా బరువు పెరుగుతున్నారు. బయట దొరికిన ఫుడ్ తినడం వల్ల అనారోగ్యమైన కొవ్వులు శరీరంలో పెరుగుతున్నాయి. దీనివల్ల ఊబకాయం, థైరాయిడ్ వంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇప్పటికే ఊబకాయం బారిన పడిన వారి సంఖ్య పెరిగింది. రోజురోజుకీ ఇంకా వీరి సంఖ్య పెరుగుతూనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
భవిష్యత్తులో ఊబకాయం బారిన పడే యువత సంఖ్య ఇంకా పెరుగుతుందని ఇటీవల ది లాన్స్ ట్ మెడికల్ జర్నల్ తెలిపింది. 2050 వచ్చే సరికి దాదాపుగా 260 మిలియన్ల అమెరికన్‌లు ఊబకాయం బారిన పడతారని తెలిపింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో.. ఇలా ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడిన తర్వాత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహిస్తారు. అయితే ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు అంటున్నారు. స్థూలకాయం అనేది ఇప్పటి వరకు ప్రమాదకరమైన వ్యాధిగా గుర్తించలేదు. కానీ భవిష్యత్తులో ఇది కూడా గుండె జబ్బులు, కాలేయం, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల పక్కన ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఊబకాయాన్ని భవిష్యత్తులో మందులతో కూడా తగ్గించ లేనంత విధంగా మారిపోతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి యాక్టివ్‌గా ఉంటూ శారీరక వ్యాయామానికి ఇంపార్ట్‌టెంట్ ఇవ్వండి. రోజూ ఉదయం రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల శరీరంలో కొవ్వులు తగ్గుతాయి.
ఊబకాయం సమస్య రాకుండా ఉండాలంటే జంక్ ఫుడ్స్ అసలు తినకూడదు. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు. అలాగే శరీరానికి శారీరక శ్రమ కూడా లేకపోవడం వల్ల కొందరు ఊబకాయం బారిన పడుతున్నారు. తినేసి ఒకే ప్లేస్‌లో కూర్చోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. కాబట్టి తిన్న వెంటనే అలా కూర్చోవద్దు. రోజూ వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేస్తుండాలి. దీనివల్ల శరీరంలో కొవ్వులు కరుగుతాయి. పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల కొంతవరకు ఊబకాయం సమస్య నుంచి విముక్తి పొందుతారు. కాబట్టి ఈ నియమాలు పాటిస్తే ఎలాంటి సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.