Nutritional deficiency: పోషకాహార లోపంతో బాధపడుతున్నారా? అయితే మీకు ఈ సమస్యలు తప్పవు

పోషకార లోపం శరీరంలో ఏర్పడితే కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడతారు. మరి ఆ సమస్యలు ఏంటి? పోషకార లోపం రాకుండా ఉండాలంటే ఆహారంలో ఎలాంటి పదార్థాలు చేర్చుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 20, 2024 6:02 pm

Nutritional deficiency:

Follow us on

Nutritional deficiency: పోషకాలు ఉండే ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ రోజుల్లో చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. శరీరానికి తగిన పోషకాలు ఉండే ఆహారం తీసుకోకపోవడం, ఐరన్, ప్రొటీన్, ఖనిజాలు లేని పదార్థాలు తీసుకోవడం వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. అయితే ఈ సమస్యల వస్తే వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులకు కారణం అవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బిజీ లైఫ్‌లో ఎక్కువ మంది తింటున్నామా? లేదా? అనే విషయమే చూస్తున్నారు. కానీ ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన ఆహారం తీసుకుంటున్నామా? లేదా? అనే విషయం ఆలోచించడం లేదు. పనిలో పడి కొందరు ఇంట్లో వండుకోకుండా బయట ఫాస్ట్‌ఫుడ్‌ను తింటుంటారు. దీనివల్ల లేని పోని అనారోగ్య బారిన పడటంతో పాటు పోషకార లోపంతో ఇబ్బంది పడుతున్నారు. శరీరానికి సరిపడా పోషకాలు లేకపోతే కొన్ని ప్రమాదకర వ్యాధుల బారిన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు ఫైబర్, ప్రొటీన్లను అసలు ఆహారంలోకి తీసుకోరు. దీనివల్ల దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడతారు. అయితే పోషకార లోపం శరీరంలో ఏర్పడితే కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడతారు. మరి ఆ సమస్యలు ఏంటి? రాకుండా ఉండాలంటే ఆహారంలో ఎలాంటి పదార్థాలు చేర్చుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

 

శరీరానికి సరిపడా పోషకాలు లేకపోతే క్వాషియోర్కోర్ అనే వ్యాధి వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. దీర్ఘకాలికంగా ప్రొటీన్లు ఉండే పోషకాలు తీసుకోకపోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడతారు. ఈ వ్యాధి వస్తే శరీరంలోని చేతులు, పాదాలు, ముఖంలో వాపు వస్తుంది. అలాగే వెంట్రుకలు, చర్మంలో కూడా మార్పులు కనిపిస్తాయి. చర్మం పొరలుగా రాలిపోతుంది. దీంతో పాటు మరాస్మస్ అనే లోపం కూడా వస్తుంది. ఆహారంలో ప్రోటీన్, క్యాలరీలు లేకపోవడం వ్ల ఇది వస్తుంది. ఈ మరాస్మిక్ ఎక్కువగా పిల్లలకు వస్తుంది. దీని వల్ల తొందరగా బరువు తగ్గడం, కండరాలు బలహీనం కావడం అవుతుంది. ఈ వ్యాధుల బారిన పడితే వెంటనే జీవనశైలిలో మార్పులు చేయాలి. ముఖ్యంగా అధిక క్యాలరీలు, ప్రొటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పాలు, రవ్వ, గంజి, ఉడికించిన వేరుశెనగ, పప్పులు, బియ్యం, గుడ్లు, జామ, సోయాబీన్స్, బియ్యం, పప్పు, సోయాబీన్స్, ఖిచ్రీ, మిక్స్డ్ ఫ్లోర్ బిస్కెట్, క్యారెట్, మొలకెత్తిన గింజలు వంటివి తీసుకోవాలి. వీటిని తీసుకోవడం క్వాషియోర్కోర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. పూర్తిగా బయట దొరికే ఫాస్ట్‌ఫుడ్‌ను అసలు తినకూడదు. దీంతో క్వాషియోర్కోర్ నుంచి విముక్తి పొందవచ్చు.

 

పోషకాహార లోపంతో బాధపడేవారు ఎక్కువగా రక్తహీనత బారిన పడతారు. ఇది చాలా ప్రమాదకరమైనది. తినే ఫుడ్‌లో ఐరన్, ఖనిజాలు లేకపోవడం వల్ల ఈ లోపం వస్తుంది. మహిళలు ఎక్కువగా ఈ రక్తహీనత బారిన పడతారు. ఎందుకంటే నెలసరిలో రక్తస్రావం ఎక్కువగా కావడం, గర్భధారణ సమయాల్లో రక్తస్రావం కావడం వల్ల రక్తహీనత బారిన పడతారు. కాబట్టి మహిళలు తప్పకుండా ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను తీసుకోవాలి. అధిక ప్రోటీన్, ఐరన్, విటమిన్ సి, బి కాంప్లెక్స్‌ ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఎండుద్రాక్ష, ఖర్జూరం, అత్తి పండ్లు, ఆకు కూరలు, సోయాబీన్స్, పుచ్చకాయ, చికు వంటివి తినాలి. వీటితో పాటు గుడ్లు, పాలు వంటివి కూడా తీసుకోవడం వల్ల బాడీకి ప్రొటీన్ పుష్కలంగా అందుతుంది. దీంతో పోషకాహార లోపం నుంచి బయటపడతారు.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.