https://oktelugu.com/

Software Job: అప్పుడు పండుగ.. ఇప్పుడు దండగ..!

2022 నుంచి 2023 వరకు.. అబ్బాయిలు ఉన్నత చదువులు చదివి.. ఎంతో కష్టపడి ఐటీ సెక్టార్ జాబ్ కొట్టారు.. ఈ క్రమంలో పెళ్లిసంబంధాలు చూడడం.. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి కోసం వెతకడం..ఒకతను దొరకగానే ‘అబ్బాయ్ ఏం చేస్తున్నాడు..’ అనగానే.. పెళ్లిళ్ల పేరయ్య ‘అబ్బాయి బాగా చదివాడు.. సాష్ట్ వేర్ జాబ్ .. ఏడాదికి 10 లక్షల ప్యాకేజీ..

Written By:
  • Srinivas
  • , Updated On : July 22, 2023 / 02:32 PM IST
    Follow us on

    Software Job: అది 2014వ సంవత్సరం.. ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.. ఒక అమ్మాయిని చూశాం..ఆమె చాలా అందంగా ఉంది.. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలి.. నాకున్న ఉద్యోగంతో ఆమెను ఎలాగైనా పోషించుకుంటా.. ఆమె మా ఇంట్లో అడుగుపెడితే చాలు.. నా జన్మ ధన్యమైపోద్ది.. కానీ అమ్మాయి, ఆమె తల్లిదండ్రులు మాత్రం.. ‘పిలగాడు ఏం జాబ్ చేస్తున్నాడు.. సాఫ్గ్ వేర్ జాబేనా? ఆ ఉద్యోగమైతేనే సెక్యూరిటీ ఉంటుంది.. మా అమ్మాయి చాలా సంతోషంగా జీవిస్తుంది..’ ఇంత చిన్న ఉద్యోగమైతే పిల్లనివ్వడం కష్టమే.

    2022 నుంచి 2023 వరకు.. అబ్బాయిలు ఉన్నత చదువులు చదివి.. ఎంతో కష్టపడి ఐటీ సెక్టార్ జాబ్ కొట్టారు.. ఈ క్రమంలో పెళ్లిసంబంధాలు చూడడం.. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి కోసం వెతకడం..ఒకతను దొరకగానే ‘అబ్బాయ్ ఏం చేస్తున్నాడు..’ అనగానే.. పెళ్లిళ్ల పేరయ్య ‘అబ్బాయి బాగా చదివాడు.. సాష్ట్ వేర్ జాబ్ .. ఏడాదికి 10 లక్షల ప్యాకేజీ.. ఫారిన్ కూడా వెళ్లే అవకాశం..’ వద్దయ్య బాబు వద్దు.. సాఫ్ట్ వేర్ జాబ్ చేసే కుర్రాడు వద్దే వద్దు.. చిన్న ఉద్యోగమైనా పర్వాలేదు.. సొంత వ్యాపారమైతే ఇంకా నయం.. ’

    కాలం మారుతున్న కొద్దీ మనుషుల అభిప్రాయాలు మారుతున్నాయి. ముఖ్యంగా కరోనా కాలం తరువాత విభిన్న పరిస్థితులు ఎదరయ్యాయి. ఒకప్పుడు సాఫ్ట్ వేర్ జాబ్ అంటే పండుగ చేసుకున్నారు. కానీ ఇప్పడు దండగ అంటున్నారు. అంటున్నారు. ఉన్నంత సేపు హై ఫై లైప్ ఉన్నా.. ఒక్కసారి ఊడిన తరువాత ఏం చేయాలో తెలియని పరిస్థితి. అంతర్జాతీయ ప్రమాణాలు, ఇతర కారణాలతో చాలా కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగాలు ఊడుతున్నాయి. 2023 ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు ఏకంగా 6,940 ఉద్యోగులు ఇంటికి వెళ్లినట్లు నివేదికలు తెలుపుతున్ని. ప్రస్తుతం ఐటీ సెక్టార్ మొత్తంలో 3,36, 297 ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.

    తాజాగా ఇన్ఫోసిస్ లాభాల కంటే నష్టాల బాటలోనే సాగుతోంది. దీంతో తమ ఉద్యోగులను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఈ కంపెనీ వెల్లడించిన త్రైమాసిక ఫలితాల ప్రకారం 6,940 మంది ఉద్యోగులు తగ్గినట్లు తెలుస్తోంది. ఇన్షోసిస్ మాత్రమే కాకుండా విప్రో 8812, హెచ్ సీఎల్ 2506 ఉద్యోగులు తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో ఐటీ సెక్టార్ జాబ్ అంటే చాలా మంది భయపడుతున్నారు. అయితే టీసీఎస్ మాత్రం కొత్తగా 523 ఉద్యోగులను చేర్చుకుంది.

    ఏదీ ఏమైనా ఒకప్పుడు పండుగలా కొనసాగిన సాఫ్టవేర్ జాబ్ అంటే వణుకుతున్నారు. అయితే చాలా మంది ముందుగానే ఇతర ఉద్యోగాలు, లేదా వ్యాపారాలు ప్రారంభించుకుంటున్నారు. మరికొందరు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక పెళ్లిళ్లు చేసుకునేవారి విషయంలో సాఫ్ట్ వేర్ జాబ్ ఒకప్పుడు వరంలా ఉండగా.. ఇప్పడు శాపంగా మారిందని అంటున్నారు. అయితే ఈ పరిస్థితి ఎప్పటికీ ఉండదని, మరికొన్ని నెలల్లో యథాస్థితికి వస్తుందని అంటున్నారు. అంతేకాకుండా కరోనా తరువాత చాలా కంపెనీలు ఆర్థికంగా పుంజుకుంటున్నాయని, అయితే కొన్ని మాత్రం ఫైనాన్షియల్ గా కోలుకోలేకపోతున్నాయన్న చర్చ సాగుతోంది.