LPG Gas Cylinder: దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి నెలా గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధర 950 రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఉండటం గమనార్హం.

రోజురోజుకు పెరుగుతున్న ధరల వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే కేవలం 634 రూపాయలకే కొత్త గ్యాస్ సిలిండర్ ను పొందే అవకాశం అయితే ఉంది. మార్కెట్ లో 14.2 కేజీల సిలిండర్ ధర 950 రూపాయలుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే 10 కేజీల సిలిండర్ ను మాత్రం కేవలం 634 రూపాయలకే పొందవచ్చు. 5 కేజీల గ్యాస్ సిలిండర్ ధర 502 రూపాయలుగా ఉంది.
కంపొసైట్ ఎల్‌పీజీ సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. సాధారణ సిలిండర్ తో పోలిస్తే ఈ సిలిండర్ బరువు 7 కిలోలు తక్కువ కావడం గమనార్హం. తుప్పు పట్టకపోవడం ఈ సిలిండర్ల ప్రత్యేకత అని చెప్పవచ్చు. దేశంలోని 28 ప్రధాన నగరాల్లో ప్రస్తుతం ఈ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని ప్రాంతాలలో కూడా ఈ గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి వస్తాయి.
Also Read: Virat kohli: విరాట్ కోహ్లీ బయోపిక్ కు రంగం సిద్ధం: ఏ హీరో బెటర్?
ప్రధాన నగరాలలో నివశించే ప్రజలు సమీపంలోని గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ పొందాలని భావించే వాళ్లకు ఈ గ్యాస్ సిలిండర్లు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
Also Read: ICC T20 World cup:అక్షర్ కు షాకిచ్చిన బీసీసీఐ.. శార్ధుల్ ఠాకూర్ కు చోటు.. కారణమిదే