Sleeping : మనిషికి తిండి లేకపోయిన కొన్ని రోజులు బ్రతకగలడు.. కానీ నిద్రలేకపోతే అస్సలు ఉండలేరు. ఒక్కరోజు నిద్ర లేకపోతే ఆ నిద్రను కవర్ చేయడానికి దాదాపు మూడు రోజులు నిద్రపోతారు. అయిన ఆ నిద్ర కవర్ కాదు. నిద్ర లేకపోతే సరిగ్గా ఏ పని చేయలేం. దేనిమీద కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేం. ఒత్తిడి, ఆందోళన, స్మార్ట్‌ఫోన్ల వినియోగం, నైట్‌షిఫ్ట్‌ల వల్ల చాలామంది లేటుగానే నిద్రపోతున్నారు. కళ్లు మూసిన వెంటనే నిద్రపట్టేవాళ్లు తక్కువ అయ్యారు. కళ్లు మూసిన వెంటనే నిద్రపడితే వాళ్లంతా అదృష్టవంతులు కూడా ఈలోకంలో ఎవరూ ఉండరు. నిద్ర అనేది మనుషులకి చాలా ముఖ్యమైనదే. అయితే ఎక్కువ మందికి సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే నిద్రలేమి వల్ల మానసిక సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. మహిళల్లో అయితే ముఖ్యంగా సంతాన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిద్రలేమి అనే కనిపించానికి చిన్న సమస్యే కావచ్చు. కానీ దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయట. అవేంటో ఈరోజు తెలుసుకుందాం.
నిద్రలేమి వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యు నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర లేకపోతే రక్తపోటు పెరగుతుంది. దీంతో హార్ట్ స్ట్రోక్ వస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే నిద్రలేమి రక్తంలోని చక్కెర స్థాయిలను ప్రభావితం చేసి, ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తోంది. దీనివల్ల డయాబెటిస్ వస్తుంది. కనీసం 8గంటల నిద్ర తప్పనిసరి. అయితే 6 గంటల కంటే తక్కువగా నిద్రపోతే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్ర తక్కువైతే మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. దీంతో జ్ఞాపకశక్తి తగ్గుతుందని నిపుణలు అంటున్నారు. సరిగ్గా ఏ పనిచేయలేకపోవడం, గంటలో చేయాల్సిన పనిని పది గంటలు చేయడం వంటివి కనిపిస్తాయి. తక్కువ నిద్ర వల్ల రోగనిరోధకశక్తిపై ప్రభావం పడుతుంది. దీంతో మీరు ఇన్ఫెక్షన్లకు గురవుతారు.
నిద్రలేమి వల్ల ఆకలి ఎక్కువగా పెరుగుతుంది. దీంతో అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. మనిషికి నిద్ర అనే చాలా ఇంపార్ట్‌టెంట్. పగలు ఎంత నిద్రపోయినా సరే.. రాత్రి నిద్ర అనేది తప్పనిసరి. రాత్రి నిద్రలేకపోతే డిప్రెషన్‌కి దారితీస్తుంది. నిద్రలేమి శరీరంలోని హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. దీంతో అవయవాల పనితీరు తగ్గి.. లైంగికంగా ఆసక్తి తగ్గడం, మూడ్ స్వింగ్స్ మారడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా మహిళల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుంది. అయితే నిద్రకు సాయపడే మెలటోనిన్ హార్మోన్‌కి, ప్రత్యుత్పత్తి వ్యవస్థకు దగ్గర సంబంధం ఉంది. నిద్రకు ఆటంకం కలిగితే ప్రత్యుత్పత్తి హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. దీంతో సంతాన సమస్యలు వస్తాయి. అలాగే నిద్రలేమి వల్ల అండం నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్లు తప్పకుండా రోజుకి 8 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. లేకపోతే గర్భధారణపై ప్రభావం పడుతుంది. కాబట్టి సరైన నిద్ర శరీర ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి తప్పనిసరి.