Group C Jobs: నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. గ్రూప్ సీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్లంబర్, ఎలక్ట్రీషియన్, లైఫ్‌గార్డ్, కానిస్టేబుల్, ఎంటీఎస్, పంప్ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మోటార్ మెకానిక్, బ్యాండ్, జనరల్ డ్యూటీ విభాగాలతో పాటు కుక్, క్యాంటిన్ అటెండెంట్, స్వీపర్ విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతోంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 18,000 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు వేతనంగా లభిస్తుంది. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. సంబంధిత పనిలో అనుభవం ఉండటంతో పాటు సంబంధిత ట్రేడ్ సర్టిఫికేట్ ను కలిగి ఉండి పదో తరగతి పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
Also Read: Bheemla Nayak OTT: ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ను కూడా ఊపేయబోతున్న ‘భీమ్లా నాయక్’ !
ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన వాళ్లను రాతపరీక్షకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలుస్తోంది. ఆఫ్‌లైన్ ద్వారా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీ, ఉమయుం, మేఘాలయ-793123 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. 2022 సంవత్సరం ఏప్రిల్ 25, ఏప్రిల్ 28 తేదీలలో ఫిజికల్ టెస్ట్ ను నిర్వహిస్తారు.
http://nepa.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది.
Also Read: SS Rajamouli RRR Movie: అటు క్రేజ్ ఇటు కాన్ఫిడెన్స్.. మధ్యలో ఆర్ఆర్ఆర్