Credit Card: ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. వివిధ బ్యాంకులు రకరకాల బెనిఫిట్లను కల్పిస్తూ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే మీరు కూడా క్రెడిట్ కార్డులను వాడుతున్నారా? అయితే ఇది మీ కోసమే..!
షాపింగ్ లకు వెళ్లిన సమయంలో చాలామంది క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఒక్కోసారి క్రెడిట్ కార్డును మర్చిపోయి ఉంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ కార్డు మర్చిపోయినా ఇకపై మీరు ఇబ్బంది పడే పరిస్థితుల నుంచి తప్పించుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా? క్రెడిట్ కార్డును యూపీఐతో లింక్ చేసుకుని పేమెంట్స్ ను చేయొచ్చు.
ఇటీవలే డిజిటల్ పేమెంట్స్ ను ప్రొత్సహించేందుకు గానూ యూపీఐకి క్రెడిట్ కార్డులను అనుసంధానం చేసిన సంగతి తెలిసిందే. రూపే క్రెడిట్ కార్డుల వినియోగదారులకు ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ఆర్బీఐ తీసుకువచ్చిన ఈ విధానంతో యూపీఐకి క్రెడిట్ కార్డును లింక్ చేసుకోవచ్చు. ఈ క్రమంలో సంబంధిత బ్యాంక్ ఇచ్చిన క్రెడిట్ పరిమితి వరకూ పేమెంట్స్ ను చేయొచ్చు. ఈ విధంగా వాడుకునే క్రెడిట్ ను తిరిగి చెల్లించడానికి తమ ఖాతాదారులకు క్రెడిట్ కార్డును జారీ చేసిన సంస్థలు కొంత సమయాన్ని ఇస్తాయన్న సంగతి తెలిసిందే.
అంతేకాదు క్రెడిట్ కార్డు వలన పేమెంట్స్ చేయడం వలన రికార్డు పాయింట్లు రావడంతో పాటు క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుందని తెలుస్తోంది. ఫోన్ పేను ఓపెన్ చేసి ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే అందులో యాడ్ రూపే అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో క్రెడిట్ కార్డు డిటైల్స్ ను ఎంటర్ చేయాలి. ఇలా చేసుకోవడం ద్వారా క్రెడిట్ కార్డు లేకపోయినా చెల్లింపులు జరపవచ్చు. అలాగే స్వైపింగ్ మిషన్ లేని చిన్న దుకాల్లోనూ యూపీఐ యాప్ ద్వారా క్రెడిట్ కార్డుతో బిల్లులను కట్టవచ్చు. యూపీఐతో చిన్న చిన్న లావాదేవీలు కూడా బ్యాంకు స్టేట్ మెంట్స్ లో మనం చూసుకోవచ్చు. అయితే మాస్టర్ కార్డ్,వీసా వంటి నెట్ వర్క్ లతో పని చేసే క్రెడిట్ కార్డులకు ఈ ఫెసిలిటీ వర్తించదు.