Hair Health: నేటి కాలంలో చాలామంది తెల్లజుట్టుతో విపరీతంగా బాధపడుతున్నారు. చిన్న వయసులోనే తెల్లజుట్టు రావడంతో రకరకాల పద్దతుల్లో జుట్టును నల్లగా మార్చుకుంటున్నారు. కానీ ఇవి తాత్కాలికంగా మాత్రమే సమస్యను పరిష్కరిస్తున్నాయి. అంతేకాకుండా కొందరు హెయిర్ బ్లాక్ కావడానికి ప్రత్యేకంగా మెడిసిన్ వాడుతూ.. రంగులను వేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చి అనారోగ్యాల బారినపడుతున్నారు. అయితే కొన్ని సాంప్రదాయ పద్దతుల్లో జుట్టును నల్లగా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
మనిషి తల వెంట్రుకలు నల్లగా ఉంటేనే అందంగా కనిపిస్తారు. ఇవి తెల్లగా మారడం వల్ల చిన్న వయసులోనే వృద్ధుడిలా కనిపిస్తారు. వాతావరణంలో మార్పులతో పాటు నీటి కలుషితం వల్ల తెల్ల వెంట్రుకలు వస్తుంటాయి. కొందరికి జన్యులోపంతో నల్లటి వెంట్రుకలు తెల్లగా మారుతాయి. సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారికి వయసు రీత్యా జుట్టు తెల్లగా మారుతుంది. కానీ స్కూలుకెళ్లే విద్యార్థుల్లోనూ తెల్లటి వెంట్రుకలు కనిపించడంతో తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు. దీని పరిష్కారానికి పెద్దగా ప్రయాస పడాల్సిన అవసరం లేదు. ఇంట్లో దొరికే ఈ వస్తువులతో ఆయిల్ ను తయారు చేసుకొని తలకు అంటించాలి.
వీటిలో ప్రధానంగా చెప్పుకునేది సోరకాయ ఆయిల్. సోరకాయ నూనెతో వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సోరకాయను కూరగాయగా మాత్రమే కాకుండా ఇటువంటి వాటికి కూడా వాడొచ్చు. ముందుగా సోరకాయను పొట్టుతో ఉండగానే చిన్న చిన్న ముక్కలను చేసుకోవాలి. వీటిని బాగా ఎండలోఉంచాలి. వీటిలోని నీటి శాతం పూర్తిగా వెళ్లిన తరువాత ఈ ముక్కలను పొడిలా తయారు చేసుకోవాలి. ఈ పౌడర్ ను చాలా కాలం వరకు నిల్వ చేసుకోవచ్చు.
ముందుగా స్టౌపై ఓ పాత్ర పెట్టి అందులో కావాల్సినంత కొబ్బరినూనెను వేసి వేడిచేయాలి. వేడి చేసిన ఈ కొబ్బరి నూనెలో సోరకాయ పౌడర్ ను తగినంత వేసి మిశ్రమం చేయాలి. దీని పేస్టులాగా తయారు చేసి దానిని జుట్టుకు వేసుకోవాలి. తలకు అంటించిన తరువాత 30 నిమిషాల పాటు వెయిట్ చేయాలి. ఆ తరువాత తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా మూడు రోజులకు ఒకసారి తలకు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా తెల్ల జుట్టు నల్లగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.