https://oktelugu.com/

Night Jasmin: ఈ చెట్టు పూలు సువాసనే కాదు.. ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి..

ఆయుర్వేద వైద్యం ప్రకారం పారిజాత పుష్పం వల్ల మనుషులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పుష్పాలతో పాటు చెట్టుకు సంబంధించిన ఆకులు, నూనెను వివిధ అనారోగ్య సమస్యలకు వాడుతారు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 2, 2024 / 11:33 AM IST

    Nght Jasmin Flowers

    Follow us on

    Night Jasmin: కొన్ని పూలు అందాన్ని ఇస్తాయి.. మరికొన్ని పూలు సువాసనను ఇస్తాయి.. కానీ ఈ పుష్పాలు మాత్రం సువాసనతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు సత్యభామ కోసం పారిజాత వృక్షాన్ని తీసుకొస్తారు. ఇది కేవలం పురాణాల వరకే పరిమితం అని అనుకున్నారు. కానీ ఈ పారిజాత పుష్పాలు ఇప్పుడు కూడా అందుబాటులో ఉన్నాయి. నక్షత్రాల వలె ఉండే ఈ పుష్పాలు అద్భుతమైన సువాసను అందిస్తాయి. ఇవి సువాసనను మాత్రమే కాకుండా ఈ చెట్టు బెరడు, పూలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

    ఆయుర్వేద వైద్యం ప్రకారం పారిజాత పుష్పం వల్ల మనుషులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పుష్పాలతో పాటు చెట్టుకు సంబంధించిన ఆకులు, నూనెను వివిధ అనారోగ్య సమస్యలకు వాడుతారు. జలుబు, జీర్ణ సమస్యలు, కీళ్ల నొప్పులు వంటి చికిత్సలో దీని బెరడును ఉపయోగిస్తారు. అంతేకాకుండా కడుపునొప్పితో బాధపడేవారు. ఈ ఆకు రసంను ఉపయోగిస్తారు. పారిజాత పుష్పాలు కంటికి కూడా మేలు చేస్తాయని చెబుతున్నారు.

    పారిజాత పుష్పాల్లో విటమిన్ సి, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పూల సువాసనతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పారిజాత చెట్టు ఆకులు వివిధ పద్ధతుల్లో శరీరంలోకి వెళితే జీర్ణ క్రియ సమస్యలు మాయమవుతాయి. అజీర్ణంతో ఉండేవారు దీని నుంచి ఉపశమనం పొందుతారు. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడితో ఉంటున్నారు. ఇంట్లో పారిజాతం చెట్టు ఉంటే దాని పూల నుంచి వచ్చే సువాసనతో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.

    గొంతు సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆయుర్వేద మెడిసిన్ వాడితే అందులో పారిజాతం చెట్టుకు సంబంధించిన బెరడు, లేదా ఆకులు కలిసే ఉంటాయి. దీని వేరును నేరుగా నమిలి తినడం వల్ల గొంతు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.అలాగే ఈ చెట్టు ఆకు రసం తాగడం వల్ల శరీరంలో ఉండే ఎలాంటి నొప్పినైనా నివారిస్తుంది. పారి జాతాన్ని ఇంగ్లీషులో నైట్ జాస్మిన్ అంటారు. ఇది ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్యమే మంచి జరుగుతుందని పలువురు చెబుతున్నారు.