New Maruti Celerio : కొత్త కారు కొనాలని చూస్తున్నారా? అది కూడా మంచి మైలేజ్, సేఫ్టీ, బడ్జెట్‌కు అందుబాటులో ఉండాలా? అయితే మీకో గుడ్ న్యూస్. మారుతి సుజుకి ఈ నెలలో తమ పాపులర్ కారు సెలెరియో పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. సెలెరియో దాని మైలేజ్ కారణంగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ నెలలో మీరు ఈ కారును కొనుగోలు చేస్తే రూ.67,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మారుతి సుజుకి ఇండియా ఈ నెలలో తమ దాదాపు అన్ని కార్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ జాబితాలో ఎరీనా డీలర్‌షిప్‌లలో అమ్ముడయ్యే సెలెరియో కూడా ఉంది. సెలెరియోను ముఖ్యంగా దాని అధిక మైలేజ్ కోసమే కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడతారు. ఈ నెలలో సెలెరియోను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే రూ.67,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌పై అత్యధిక డిస్కౌంట్ ఇస్తున్నారు. మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్, CNG వేరియంట్‌లపై రూ.62,500 వరకు క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు.
మైలేజీ విషయానికి వస్తే సెలెరియో పెట్రోల్ వేరియంట్ లీటరుకు 26.68 కి.మీ మైలేజ్ ఇస్తుంది. CNG వేరియంట్ అయితే ఏకంగా లీటరుకు 34.43 కి.మీ మైలేజ్ అందిస్తుంది. ఇది చాలా ఎక్కువ మైలేజ్. సెలెరియో ఎక్స్-షోరూమ్ ధరలు రూ.5.64 లక్షల నుండి రూ.7.37 లక్షల వరకు ఉన్నాయి. సెలెరియోలో K10C డ్యూయల్‌జెట్ 1.0-లీటర్ త్రి సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌తో వస్తుంది. అంటే కారు ఆగితే ఆటోమేటిక్‌గా ఇంజిన్ ఆగి, కదలిక వస్తే స్టార్ట్ అవుతుంది. దీంతో మైలేజ్ పెరుగుతుంది. ఈ ఇంజిన్ 66 హార్స్‌పవర్ శక్తిని, 89 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌లకు జత చేశారు. అయితే, LXI అనే బేస్ వేరియంట్లో మాత్రం ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ లేదు.
సెలెరియో కొత్త ముందు గ్రిల్, షార్ప్ హెడ్‌లైట్లు, ఫాగ్ లైట్ కేసింగ్ తో వస్తుంది. దీనికి బ్లాక్ కలర్ యాక్సెంట్‌తో కూడిన ముందు బంపర్ కూడా ఉంది. ఈ కారులో కొన్ని డిజైన్ అంశాలను మారుతి ఎస్-ప్రెస్సో నుంచి కూడా తీసుకున్నారు. కారు సైడ్ ప్రొఫైల్ కూడా పాత మోడల్ కంటే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. కొత్త డిజైన్‌తో కూడిన 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇందులో ఉన్నాయి. వెనుక భాగంలో కారు బాడీ రంగులో ఉండే వెనుక బంపర్, ఆకర్షణీయమైన టైల్‌లైట్స్, కర్వీ టైల్‌గేట్ ఉన్నాయి.
సెలెరియోలో లోపల స్థలాన్ని పెంచారు. దీంతో ప్రయాణం మరింత సౌకర్యంగా ఉంటుంది. కారు లోపల ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ హిల్ హోల్డ్ అసిస్ట్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటి ఫీచర్లు లభిస్తాయి. కారు లోపల షార్ప్ డ్యాష్ లైన్స్‌తో సెంటర్-ఫోకస్డ్ లుక్, క్రోమ్ యాక్సెంట్‌తో కూడిన ట్విన్-స్లాట్ ఏసీ వెంట్స్, కొత్త గేర్ షిఫ్ట్ డిజైన్, సీట్ల అప్‌హోల్‌స్ట్రీకి కొత్త డిజైన్ ఇచ్చారు. ఇందులో 7-అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో డిస్‌ప్లే కూడా ఉంది. ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేస్తుంది. సెలెరియోలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABSతో పాటు EBD, ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ హిల్ హోల్డ్ అసిస్ట్ వంటివి ఉన్నాయి. మొత్తంగా ఇందులో 12 సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి. ఈ కారును మొత్తం 6 రంగులలో కొనుగోలు చేయవచ్చు… అవి సాలిడ్ ఫైర్ రెడ్, స్పీడీ బ్లూ, ఆర్కిటిక్ వైట్, సిల్కీ సిల్వర్, గ్లిస్నింగ్ గ్రే, కెఫిన్ బ్రౌన్.