Train Ticket Cancellation: దేశంలో ప్రతిరోజూ కోట్ల సంఖ్యలో ప్రయాణికులు రైలు ద్వారా ప్రయాణాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలని భావించే వాళ్లకు రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే తరచూ రైలు ప్రయాణాలు చేసేవాళ్లకు ఐఆర్‌సీటీసీ అదిరిపోయే తీపికబురు అందించింది. ఛార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా ఐఆర్‌సీటీసీ టికెట్ క్యాన్సిల్ చేసుకునే ఛాన్స్ ను కల్పిస్తోంది.

ఆన్ లైన్ లో టికెట్లను బుకింగ్ చేసుకున్న వాళ్లు ఛార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా టికెట్లను బుకింగ్ చేసుకుని సులభంగా రీఫండ్ పొందవచ్చు. ఎమర్జెన్సీ కారణాలతో ట్రైన్ టికెట్ ను క్యాన్సిల్ చేసుకునే వాళ్లకు ఐఆర్‌సీటీసీ నిర్ణయం వల్ల బెనిఫిట్ కలగనుంది. ఐఆర్‌సీటీసీ ట్విట్టర్ లో ట్వీట్ చేసి ఈ తీపికబురును రైలు ప్రయాణికులకు అందించింది. ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలను తీసుకుంటూ ఐఆర్‌సీటీసీ ప్రయాణికులను ఆకట్టుకుంటోంది.
Also Read: Marri Shashidar Reddy: బోయగూడా దుర్ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. మంత్రి తమ్ముడిపై సంచలన ఆరోపణలు
టిక్కెట్ డిపాజిట్ రశీదును ఆన్ లైన్ లో సమర్పించడం ద్వారా రైలు ప్రయాణికులు రీఫండ్ పొందవచ్చు. అన్‌ట్రావెల్డ్ టిక్కెట్లలో భాగంగా ఈ రీఫండ్ సౌకర్యం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలని భావించే వాళ్లు మొదట ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ లోకి వెళ్లి ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత మై ట్రాన్సాక్షన్ ఆప్షన్ ద్వారా టీడీఆర్ ను దాఖలు చేయవచ్చు.
ఆన్ లైన్ లో టీడీఆర్ ను దాఖలు చేసిన తర్వాత సంస్థ ఢిల్లీ అడ్రస్ ఒరిజినల్ డ్యాక్యుమెంట్లను పంపించాలి. ఐఆర్‌సీటీసీ రైలు ప్రయాణికులకు మేలు జరిగేలా తీసుకుంటున్న నిర్ణయాలపై రైలు ప్రయాణికులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Sarkaru Vaari Paata: సర్కారువారి పాటను వెంటాడుతున్న ఆ బ్యాడ్ సెంటిమెంట్.. మహేష్ బ్రేక్ చేస్తాడా..?