spot_img
Homeలైఫ్ స్టైల్New Driving License Rules: కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నారా..? రేపటి నుంచి వీరికి మరో...

New Driving License Rules: కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నారా..? రేపటి నుంచి వీరికి మరో టెస్ట్.. ముందే తెలుసుకోండి..

New Driving License Rules: రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. వీటికి అతివేగం, నిర్లక్ష్యం డ్రైవింగ్ కారణమని కొన్నిసార్లు రవాణా అధికారులు చెబుతూ ఉంటారు. అయినా కూడా కొంతమంది అవగాహన లేని డ్రైవింగ్ చేయడం వల్ల వారితోపాటు ఇతరుల ప్రాణాలను హరిస్తున్నారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్సు జారీ విషయంలో కఠిన నియమాలను ఏర్పాటు చేసింది. ఈ నియమాలు ఎలా ఉన్నాయి? ప్రమాదాల నివారణకు ఇవి ఉపయోగపడతాయి?

ప్రస్తుతం వాహనదారులు డ్రైవింగ్ లైసెన్సు పొందాలంటే ముందుగా లర్నింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పర్మినెంట్ లైసెన్స్ ను పొందవచ్చు. అయితే ఇవి విడతలవారీగా పరీక్షలు పాస్ కావాల్సి ఉంటుంది. రవాణా శాఖ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులు అయితేనే లైసెన్సును జారీ చేస్తారు. అయితే ఈ రెండు పరీక్షలతో పాటు కొత్తగా ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని సమయంలో లర్నింగ్ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ టెస్ట్ కోసం కూడా తప్పనిసరిగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఆరు మాడ్యూల్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 30 నిమిషాల చొప్పున మూడు గంటల పాటు నిర్వహించే ఈ పరీక్షలో రహదారి భద్రత అవగాహన శిక్షణ ఉంటుంది. అయితే ఇది ఆన్లైన్లోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. లాప్టాప్ లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ కు కెమెరాను ఏర్పాటు చేసి పరీక్షలో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే ఈ సౌకర్యం లేనివారు డ్రైవింగ్ స్కూల్ నుంచి కూడా పరీక్ష రాయవచ్చు. ఈ పరీక్ష పూర్తి అయిన తర్వాత ప్రత్యేకంగా సర్టిఫికెట్ నెంబర్ ఇస్తారు

ఈ పరీక్ష పూర్తి కాగానే లెర్నింగ్ కోసం దరఖాస్తు చేసేందుకు అర్హులుగా మారతారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహన్ సారధి అనే పోర్టులోకి తెలంగాణ ప్రభుత్వం కూడా జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కొత్తగా ఈ పరీక్షను వాహనదారులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని రవాణా శాఖ అధికారులు తెలుపుతున్నారు. అయితే ఆన్లైన్ ద్వారా నిర్వహించే ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పరీక్షలో రోడ్డు భద్రతకు సంబంధించిన విషయాలు.. డ్రైవింగ్ నిబంధనలు వంటివి ఉంటాయి. అయితే ముందుగా ఈ పరీక్షకు సంబంధించిన ఒక వీడియోను చూడొచ్చు. ఆ తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకుని ఎగ్జామ్స్ కు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ వీడియోలో ముందుగా రవాణా వ్యవస్థపై అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత వారికి ఏ విధంగా అర్థమైందో ఈ ఎగ్జామ్ ద్వారా తెలుస్తుంది. ఇవే కాకుండా వాహన రిజిస్ట్రేషన్ కు సంబంధించి కూడా కొత్త విధానం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. కొత్త వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఆర్టిఏ ఆఫీసుకు వెళ్లకుండా షోరూం లోనే రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకొచ్చే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ కొత్త విధానాలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్నాయి..

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version