Jobs In Google: బీటెక్ చదివిన విద్యార్థులకు గూగుల్ అదిరిపోయే తీపికబురు అందించింది. నెట్‌వర్క్ ఇంజనీర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. బెంగళూరులోని గూగుల్ కార్యాలయంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఆన్ లైన్ లో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మార్చి 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.

ఓపెన్‌ఫ్లో, సాఫ్ట్‌వేర్ నెట్వర్కింగ్ లో అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రోటోకాల్స్ తో పాటు ఎథర్ నెట్, వైఫై, హెచ్.టీటీపీ, టీసీపీ/ఐపీలపై అవగాహన ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. టెక్నికల్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీతో పాటు సమానమైన ప్రాక్టికల్ అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: Vijay Devarakonda Liger Movie: ‘విజయ్ దేవరకొండ’తో సోషల్ మీడియా బ్యూటీ రొమాన్స్
ఆపరేటింగ్ ఎంటర్‌ప్రైజ్ క్లాస్ రూటర్లు, స్విచ్‌లపై వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఏఎస్‌ఐటీ ఫంక్షనాలిటీ, డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్, బ్యాక్ ప్లేన్ లో అనుభవం ఉన్నవాళ్లు సైతం ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు కోడ్ రివ్యూస్ ను సమీక్షించడంతో పాటు ఆటోమేషన్ సామర్థ్యాలను అంచనా వేయాల్సి ఉంటుంది.
నెట్వర్క్ కు సంబంధించిన సమస్యలను ఇతరులతో కలిసి పరిష్కరించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీకెండ్స్ లో కూడా పని చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ వేతనం లభించనుంది.
Also Read: Dil Raju: మళ్ళీ తండ్రి కాబోతున్న దిల్ రాజు