Blood : ప్రతి ఒక్కరికి బ్లడ్ చాలా అవసరం. శరీరంలో రక్తం బాగుంటేనే అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. అయితే అనారోగ్యం కారణాలతోనో లేక ప్రమాదాల కారణంగా బ్లడ్ తక్కువ అవుతుంది. ఈ సమయంలో అదనంగా బ్లడ్ యాడ్ చేస్తేనే చికిత్స చేయడానికి అనుగుణంగా ఉంటుంది. అయితే బ్లడ్ డోనేట్ చేయడానికి చాలా మంది దాతలు ముందుకు వస్తుంటారు. కానీ అత్యవసర సమయంలో వారు కొన్ని కారణాల వల్ల బిజీగా ఉండాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో బ్లడ్ కావాలంటే ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? అనే సందేహం ఉన్న వారికి మంచి మార్గం ఉంది. అదేంటో తెలుసుకోండి.
ప్రమాదాల కారణంగా చాలా మందికి బ్లడ్ పోతుంది. అలాగే కొన్ని అనారోగ్య కారణాల వల్ల రక్తం అవసరం ఉంటుంది. ఒక్కోసారి అత్యవసరంగా బ్లడ్ కావాల్సి ఉంటుంది. కానీ అవసరమున్న వారికి సరిపోయే విధంగా బ్లడ్ అందుబాటులో ఉండకపోవచ్చు. కొందరు బ్లడ్ డోనేట్ చేయడానికి ముందుకు వచ్చినా వారి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవచ్చు. అయితే సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఇప్పుడు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటున్నారు.
ఇలాంటి పరిస్థితి ఎదురైనవారికి అత్యవసరంగా బ్లడ్ అందించేందుకు ఓ వెబ్ సైట్ అందుబాటులో ఉంటుంది. అదే friends2support.org. ఈ వెబ్ సైట్ ద్వారా ఏ బ్లడ్ గ్రూప్ అవసరమున్నా వెంటనే పొందవచ్చు. అయితే బ్లడ్ పొందే ముందు చిన్న పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో మీ లోకేషన్ ను ముందుగా సెట్ చేసుకోవాలి. అంటే ఏ ప్రదేశంలో బ్లడ్ అవసరముందు ఆ ప్రదేశాన్ని ఎంచుకోవాలి. ఇందులో ఉండే జిల్లా, మండలం సంబంధించి ఆప్షన్ ను మీ ఏరియాకు సంబందించినది సెలెక్ట్ చేసుకోవాలి.
ఉదాహరణకు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలోని వ్యక్తికి బ్లడ్ అవసరముంది. ఈ తరుణంలో వెబ్ సైట్ లోకి వెళ్లి జిల్లా, ఏరియా ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఆ ఏరియాలో ఎంత మంది బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారో.. వారి లిస్టు వస్తుంది. వీరంతా బ్లడ్ ఇవ్వడానికి ముందే రిజిస్ట్రర్ చేయించుకున్నారు. ఒకవేళ ఓ నెగెటివ్ బ్లడ్ అవసరముంటే.. అందులో ఓ నెగెటివ్ వ్యక్తిని సెలెక్ట్ చేసి వారికి కాల్ చేయాలి. వెంటనే వారు వచ్చి బ్లడ్ డోనేట్ చేస్తారు.