Shakteeswara Swamy: హిందువులలో చాలామంది శివుని భక్తులు అనే సంగతి తెలిసిందే. శివుడిని లింగాకారంలో భక్తులు ఎక్కువగా పూజించడం జరుగుతుంది. అయితే దేశంలోని ఒక ప్రాంతంలో మాత్రం శివుడు తలకిందులుగా పూజించబడుతున్నాడు. ఈ దేవాలయం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని యనమదుర్రు అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం పేరు శ్రీ శక్తీశ్వర స్వామి ఆలయం కావడం గమనార్హం. పురాతమైన ఈ ఆలయంలో విలక్షణ శివలింగం ఉంది.
కొన్ని వందల సంవత్సరాల క్రితం తవ్వకాల్లో ఈ గుడి, విగ్రహాలు బయటపడ్డాయని ఈ గుడి త్రేతాయుగం నాటిదని భక్తులు చెబుతున్నారు. ఈ గుడిలో పార్వతీదేవి సుబ్రమణ్యేశ్వర స్వామిని లాలిస్తున్నట్టు కొలువై ఉండటం గమనార్హం. ఈ ఆలయంలో మాత్రమే శివుడు తలకిందులుగా దర్శనం ఇవ్వడానికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. యముడు శివుడి గురించి తపస్సు చేసే సమయంలో శివుడు తలకిందులుగా తపస్సు చేస్తుండగా పార్వతీదేవి సుబ్రమణ్యేశ్వర స్వామిని లాలిస్తోంది.
ఆ సమయంలో యముడు శివుడిని ఉన్నపళంగా ప్రత్యక్షం కావాలని కోరగా శివుడు యదాస్థితిలో ప్రత్యక్షమయ్యారని స్థానికులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఈ ఆలయంను సందర్శించడం ద్వారా తమ వ్యాధులను నయం చేసుకోవచ్చు.