చనిపోయిన వారి వద్దకు వెళ్లిన వారు తప్పకుండా స్నానం చేయాలా? ఎందుకు?

ముఖ్యంగా ఏదైనా శవం వద్దకు వెళ్లినప్పుడు ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే స్నానం చేయకుండా లోపలికి రానివ్వరు. ఇప్పటి వారికి ఇది వింతగా అనిపించినా ఇందులో ఆరోగ్య గూడార్థం దాగుందన్న విషయం గ్రహించాలి. అదేంటంటే?

Written By: Srinivas, Updated On : February 27, 2024 2:07 pm

dead bath

Follow us on

భారతదేశం సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా భావిస్తాం. పురాతన కాలంలో పెద్దలు ఆరోగ్యంగా జీవించడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులు అవలవంభించేవారు. ముఖ్యంగా ఆ కాలంలో వచ్చిన రోగాలను నయం కావడానికి ఆయుర్వేద మెడిసిన్ వాడేవారు. ఇదే సమయంలో కొన్ని పరిశుభ్రత అలవాట్లను పాటించి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు పడేవారు. అయితే ఇప్పుడు అవి కొంచెం ఇబ్బందిగా అనిపించినా వాటిని పాటించడం వల్ల అంతా మంచే జరుగుతుందని కొందరు పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా ఏదైనా శవం వద్దకు వెళ్లినప్పుడు ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే స్నానం చేయకుండా లోపలికి రానివ్వరు. ఇప్పటి వారికి ఇది వింతగా అనిపించినా ఇందులో ఆరోగ్య గూడార్థం దాగుందన్న విషయం గ్రహించాలి. అదేంటంటే?

పూర్వ కాలంలోని మనుషులు చనిపోతే నేటి కాలంలోలాగా అంత్యక్రియలు నిర్వహించడానికి అనువైన సౌకర్యాలు ఉండేవి కావు. ఇప్పుడు ప్రత్యేకంగా శ్మశాన వాటికలు నిర్వహించి అందులో అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. అలాగే కొందరు ఖననం చేస్తున్నారు. అయితే చాలా మంది అంత్యక్రియలకు వెళ్లిన వారు స్నానం చేయకుండానే ఇంటికి వస్తున్నారు. వారు కూడా మనుషులే కదా? ఎందుకు అంటరానితనం అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

చనిపోయిన శవాన్ని లేదా వారి బందువులను ముట్టుకుంటే తప్పనిసరిగా స్నానం చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఒకప్పుడు వివిధ రోగాలు, వ్యాధులతో చనిపోయేవారు. వీరిని ఎక్కడ ఓపెన్ ప్లేస్ కనిపిస్తే అక్కడ ఖననం లేదా దహనం చేసేవారు. శవాలపై కొన్ని బ్యాక్టిరియాలో అలాగే ఉండిపోతాయి. ఇవి శవం వద్ద ఉన్న వారిపైకి వెళ్తాయి. ఇలా ఒకరిపై మరకొరికి వ్యాప్తి చెందుతాయి. ఇలా వ్యాప్తి చెందకుండా ఉండడానికి అప్పటి పెద్దలు శవం వద్దకు వెళ్లిన వారికి తప్పకుండా స్నానం చేయాలనే నిబంధన పెట్టారు.

ఇప్పుడు కూడా శవం వద్దకు వెళ్లిన వారు తప్పకుండా స్నానం చేయాలని అంటున్నారు. మనకు తెలియకుండానే కొన్ని బ్యాక్టిరియా, వైరస్ లో శరీరంపైకి వస్తాయి. అలాగే ఇంట్లోకి వస్తే కుటుంబ సభ్యులపై ప్రభావం పడుతుంది. అందువల్ల చనిపోయిన వారిని దహనం చేసిన ప్రదేశంలోనే చెరువులో లేదా పంపు కింద స్నానం చేయడం ద్వారా శరీరం శుభ్రం అవుతుంది. దీంతో ఎలాంటి సమస్య ఉండదు. అందువల్ల ఇక్కడికి వెళ్లిన వారు స్నానం చేయడానికి ప్రయత్నించాలని కొందరు పెద్దలు చెబుతున్నారు.