Mukesh Ambani New Car: ముఖేష్ అంబానీ కొన్న ఈ కారు గ్రెనేడ్లు పెట్టి పేల్చినా సేఫ్.. ఇంతకీ ఈ కార్ ఏంటి? విశేషాలివీ

Mercedes Maybach S 680 పేరుతో ఉన్న ఈ కారు 3డీ డ్రైవర్ డిస్ ప్లే, హై ఎండ్ 4డి సరైండ్ సౌండ్ సిస్టమ్, యాక్టివ్ యాంయంట్ లైటింగ్ ఉంటాయి. మొబైల్ పరికరాల ముందు, వెనుక వైర్ లెస్ చార్జింగ్ సిస్టమ్, డబుల్ సన్ విజర్, రిమోట్ ట్రంక్ మూత లాక్, యూఎస్ బీ ప్యాకేజీ ప్లస్, అనుకూల వెనుక లైటంగ్, యాక్టివ్ యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి. పనోరమిక్ సన్ రూప్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ తో కీలెస్ జీవో,డిజిటల్ లైట్ తో ఆకర్షిస్తుంది.

Written By: Chai Muchhata, Updated On : July 26, 2023 10:28 am

Mukesh Ambani New Car

Follow us on

Mukesh Ambani New Car: అపరకుభేరుడు ముఖేష్ అంబానీ గురించి రోజుకు ఒక్కసారైనా మాట్లాడుకోవాల్సి వస్తోంది. ఇండియాకు చెందిన ఈ వ్యాపారవేత్త ప్రపంచంలోని బిజినెస్ మేన్ లతో పోటీపడుతున్నాడు. అందుకు తగ్గట్టే లగ్జరీ లైఫ్ మెయింటేన్ చేస్తారు. ఇప్పటికే ఆయనకు ముంబైలో ఖరీదైన బంగ్లా ఉన్న విషయం తెలిసిందే. వీటితో పాటు అత్యంత విలువైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు లేటేస్టుగా ఆయన మరో సూపర్ మోడల్ కారును సొంతం చేసుకున్నాడు. మోస్ట్ సేఫెస్ట్, బుల్లెట్ ఫ్రూప్ గా పేరున్న S680 అనే కారును కొనుగోలు చేశాడు. ఈ కారుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ కారును ముఖేష్ అంబానీ ఎంత పెట్టి కొన్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

దశాబ్దకాలంలో టాప్ రిచెస్ట్ పర్సన్లలో టాప్ లెవల్లో ఉంటున్న ముఖేష్ అంబానీ ప్రతీది హైఫై ఉండాలని కోరుకుంటాడు. ఇందుకోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా వెనుకాడరు. అంబానీ తో పాటు ఆయన ఫ్యామిలీ కూడా లగ్జరీ లైఫ్ ను మెయింటేన్ చేస్తారు. ఈ క్రమంలో వీరికి ఇతరుల నుంచి బెదిరింపులు వస్తుంటాయి. ఈమధ్య థ్రెటింగ్ కాల్స్ చాలానే వచ్చాయి. ఈ క్రమంలో తనతో పాటు ఫ్యామిలీ సెక్యూరిటీ ఉండేలా అద్భుతమైన కారును కొనుగోలు చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆయన S680ని ఎంచుకున్నాడు. ఈ కారు ఫీచర్స్ తెలిస్తే షాక్అవుతారు.

Mercedes Maybach S 680 పేరుతో ఉన్న ఈ కారు 3డీ డ్రైవర్ డిస్ ప్లే, హై ఎండ్ 4డి సరైండ్ సౌండ్ సిస్టమ్, యాక్టివ్ యాంయంట్ లైటింగ్ ఉంటాయి. మొబైల్ పరికరాల ముందు, వెనుక వైర్ లెస్ చార్జింగ్ సిస్టమ్, డబుల్ సన్ విజర్, రిమోట్ ట్రంక్ మూత లాక్, యూఎస్ బీ ప్యాకేజీ ప్లస్, అనుకూల వెనుక లైటంగ్, యాక్టివ్ యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి. పనోరమిక్ సన్ రూప్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ తో కీలెస్ జీవో,డిజిటల్ లైట్ తో ఆకర్షిస్తుంది. 830 బీహెచ్ పీ పవర్, 80 లీటర ఫ్యూయెల్ ట్యాంక్ తో ఆకట్టుకుంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో అలరిస్తుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో తూసుకుపోతున్న ఇది 6.0 లీటర్ వీ12 ఇంజన్ ఉంది.

S 680 అత్యంత సెక్యూరిటీ మోడల్ గా చెప్పుకుంటున్నారు. ఇది బుల్లెట్ ఫ్రూప్ మాత్రమే కాకుండా తుపాకీ కాల్పుల మోతలకు, గ్రెనేడ్ల పెట్టి పెల్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. అలాగే ఫైర్ యాక్సిడెంట్ నుంచి కూడా కాపాడుతుంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుతు మాత్రమే కొనుగోలు చేసే ఈ కారు ధర రూ.10 కోట్లకు పై మాటే అంటే నమ్మక తప్పదు. ఈ కారుకు సంబంధించిన వీడియోను C12 Vlogs అనే సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిని కారు వినియోగదారులు షాక్ అవుతున్నారు.