MS Dhoni: భారత క్రికెట్ జట్టు మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఇప్పుడు ఐపీఎల్ లో ఆడుతున్నాడు. కానీ దానికి కూడా టాటా చెప్పేందుకు నిర్ణయించుకున్నాడా? అవుననే అంటున్నారు. ధోనీ కొద్ది రోజులుగా క్రికెట్ కు వీడ్కోలు పలకాలని చూస్తున్నాడు. ఇందులో భాగంగానే ఫేస్ బుక్ వేదికగా ఆదివారం 25వ తేదీన ఓ ప్రకటన చేస్తానని చెప్పడంతో అందరు కలవరపడుతున్నారు. ఇక ధోనీ తన రిటైర్ మెంట్ గురించి ప్రకటన చేస్తారని ఊహిస్తున్నారు.

ధోనీ చేసిన ప్రకటన మమ్మల్ని ఆలోచింపచేసిందని పలువురు అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. ధోనీ రిటైర్ మెంట్ ప్రకటించవద్దని సీఎస్ కేకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
2011లో ఇండియాకు వరల్డ్ కప్ అందించిన ఘనత ఆయన సొంతం. మొదటిసారి వరల్డ్ కప్ 1983 లో కపిల్ దేవ్ సారధ్యంలో రాగా రెండోసారి ధోనీ కెప్టెన్సీలో రావడం గమనార్హం. అప్పుడు ఫైనల్ లో శ్రీలంకను ఓడించిన తీరు అందరికి గుర్తుంది. మిస్టర్ కూల్ గా ధోనీ వ్యవహరించిన తీరుకు అందరు ఫిదా అయ్యారు.
ఎలాంటి తత్తరపాటు పడకుండా సావధానంగా పరుగులు రాబట్టి అందరిలో సంతోషం నింపాడు అంతటి మహత్తర క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న ధోనీ ఇక క్రికెట్ కు దూరం కానున్నాడనే వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇప్పటికే సురేష్ రైనా, రాబిన్ ఊతప్పలు క్రికెట్ కు గుడ్ బై చెప్పి న సంగతి తెలిసింది. తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ కూడా అదే బాటలో నడవనున్నాడని చెబుతున్నారు. ఆదివారం అందరి ముందుకు వస్తానని చెప్పడంతో రిటైర్ మెంట్ గురించే ప్రకటన ఉంటుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

తమ అభిమాన స్టార్ నిష్క్రమించడం మాకు ఇష్టం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ధోనీ రిటైర్ మెంట్ ప్రకటన వద్దని వారిస్తున్నారు. గత ఏడాదే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోనీ ఇక ఐపీఎల్ కు కూడా టాటా చెప్పనున్నాడనే వార్త హల్ చల్ చేస్తోంది. కానీ సొంత మైదానంలో ఆడిన తరువాతే ఆటకు అల్విదా చెబుతాడని తెలిసినా ప్రస్తుత ప్రకటన అందుకేనంటున్నారు.
ధోనీ చేసిన పోస్టుకు అభిమానులు భయపడుతున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్ కు రిటైర్ మెంట్ వద్దని సూచిస్తున్నారు.
ధోనీ లేని సీఎస్ కేను తాము చూడలేమని చెబుతున్నారు. ప్రస్తుతం ధోనీ రిటైర్ మెంట్ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశం అవుతోంది. ధోనీ రిటైర్ మెంట్ ఖాయమని కొందరు చెబుతుంటే అభిమానులు మాత్రం అలా జరగడానికి వీలు లేదు అంటూ పోస్టులు పెడుతున్నారు. ధోనీ ఆటను మేం ఆస్వాదించాల్సిందే. అతడి బ్యాటింగ్ విన్యాసం చూస్తేనే మాకు తృప్తి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. కానీ ధోనీ మాత్రం ఇక క్రికెట్ కు దూరం కావడానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం నాటి ప్రకటన చూస్తే అందరికి అర్థమైపోతోందని చెబుతున్నారు.