Motivational Story In Telugu: ప్రస్తుత సమాజంలో భక్తి భావం పెరిగిపోతుంది. చాలామంది ప్రత్యేక పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఆలయాలకు వెళ్తూ ఆధ్యాత్మిక వాతావరంలో గడుపుతున్నారు. అయితే ప్రతిరోజు పూజలు చేసే వారు తమకు అంతా మంచే జరగాలని దేవుడని కోరుకుంటుంటారు. అయితే పరిస్థితి అనుకూలంగా ఉండి కొన్ని మంచి పనులు జరగడం వల్ల దేవుడి దయవల్లే జరిగిందని అనుకుంటారు. అయితే ఒక్కోసారి మనకు వ్యతిరేకంగా కొన్ని పనులు జరిగితే.. అవి దేవుడికి కోపం వల్ల జరిగినవి అనుకుంటారు. వాస్తవానికి ప్రతి వ్యక్తి జీవితంలో జరిగే కొన్ని చెడులు కూడా దేవుడే చేయించి కాపాడుతాడు అన్న విషయం చాలామందికి తెలియదు. అలా ఎలా చేస్తాడు అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ కింది ఉదాహరణలతో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక వ్యక్తి ఉదయం లేవగానే తనకు సరైన బ్రేక్ ఫాస్ట్ దొరకదు. ఆ బ్రేక్ ఫాస్ట్ దొరకకపోవడంతో చికాకుగా ఉంటాడు. ఈ చికాకులో అతని బైక్ కి దొరకదు. దీంతో మరింతగా మానసికంగా వేదనకు గురై ఆటోలో కార్యాలయానికి వెళ్తాడు. ఇలా వెళ్లడం వల్ల అతనికి రూ. వంద నష్టం అవుతుంది. కార్యాలయానికి వెళ్లిన తర్వాత మధ్యాహ్నం భోజనం హోటల్లో తినాలని అనుకుంటాడు. కానీ అప్పటికే ఆ ఒ హోటల్ ఫుడ్ అయిపోతుంది. దీంతో బయట లభించే చిరుతిళ్లు తింటాడు. సాయంత్రం ఇంటికి వచ్చే సమయంలో ట్రాఫిక్ లో చిక్కుకుంటాడు. దీంతో ఆలస్యంగా ఇంటికి వస్తాడు. ఇలా రోజంతా తనకు బాగో లేకపోవడం వల్ల దేవుడికి కోపం వచ్చిందని అనుకుంటాడు. దీంతో అతడు దేవుడి వద్దకు వెళ్లి నేను ప్రతిరోజు పూజలు చేస్తాను.. అయినా ఈరోజు నాకు ఇలా జరగడానికి కారణం ఏంటి అని దేవుడిని ప్రార్థిస్తాడు.
చివరకు దేవుడు ప్రత్యక్షమై ఆ భక్తుడితో ఇలా అంటాడు. కొన్ని పనులు మనకు నచ్చకపోయినా.. అవి మన శ్రేయస్కరం కోసమే అని తెలుసుకోవాలని అంటాడు. ఉదయం నీకు బ్రేక్ ఫాస్ట్ దొరకకపోవడానికి కారణం ఏంటంటే.. ఈరోజు నువ్వు బ్రేక్ ఫాస్ట్ తింటే వాంతులు వచ్చే అవకాశం ఉండేది. అందుకే అవి రాకుండా కాపాడడానికి నీకు బ్రేక్ ఫాస్ట్ దొరకకుండా చేశాను. అలాగే నువ్వు ఈరోజు నీ సొంత వాహనంపై వెళ్తే ప్రమాదానికి గురై మరణం సంభవించే అవకాశం ఉండేది. అందువల్ల నీకు బైక్ కి దొరకకుండా చేశాను. మధ్యాహ్నం సమయంలో నువ్వు వెళ్లిన హోటల్లో భోజనం చేసిన వారు అనారోగ్యానికి గురయ్యారు. అందుకే అక్కడ ఆహారం దొరకకుండా చేశాను. రాత్రి సమయంలో ఇంటికి తొందరగా వస్తే ఇంట్లో వారితో గొడవ జరిగేది. అందుకే ఆలస్యంగా వచ్చేలా చేశాను.
ఇలా ప్రతి పని నీ మంచి కోసమే చేశాను. కానీ అవి నీకు నచ్చలేదు. మన జీవితంలో మంచి అయినా.. చెడు అయినా స్వీకరించాలి. ఎందుకంటే మనకు ప్రతికూల వాతావరణమే మనకు ఒక్కోసారి రక్షిస్తుంది.. అని దేవుడు చెప్పడంతో ఆ వ్యక్తికి జ్ఞానోదయం కలుగుతుంది.