Chanakya Niti: ఆచార్య చాణక్యుడు చాణక్య నీతి ద్వారా మానవులు లైఫ్ లో ఎదురవుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏ విధంగా వ్యవహరించాలో వెల్లడించారు. మనిషి జీవనం సాగించాలంటే డబ్బు ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. మన దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటే మనం మరింత సౌకర్యవంతంగా జీవనం సాగించే అవకాశాలు ఉంటాయి. డబ్బు తక్కువగా ఉంటే మాత్రం నిత్య జీవితంలో ఇబ్బందులు తప్పవు.

అయితే కొంతమంది చేతిలో డబ్బు ఉందని ఆ డబ్బును ఇష్టానుసారం ఖర్చు చేస్తుంటారు. సంపదకు లక్ష్మీదేవి దేవత అనే సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరూ జీవితంలో ఊహించని స్థాయిలో సంపాదించాలని ఆశ పడటంతో పాటు ఆ ఆశను నెరవేర్చుకోవడానికి కష్టపడతారు. డబ్బు ఉండటం వల్ల సమాజంలో గౌరవం పెరగడంతో పాటు సంతోషంతో జీవనం సాగించవచ్చు. డబ్బు ఎక్కువ మొత్తంలో ఉంటే మనిషి ప్రవర్తనలో, ఆలోచనలలో కూడా మార్పు వస్తుంది.

అయితే డబ్బు ఉందని కొన్ని తప్పులు చేస్తే మాత్రం జీవితమే నాశనమవుతుందని చాణక్యుడు హెచ్చరించారు. ఎవరైతే డబ్బు ఉందని బలహీనంగా ఉండేవారి విషయంలో అమర్యాదగా ప్రవర్తిస్తారో వాళ్లు లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. కష్టపడి సంపాదించకుండా ఇతరుల డబ్బు కోసం ఆశ పడితే కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.
డబ్బు విషయంలో అత్యాశ కలిగి ఉంటే వాళ్లు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. చెడు సహవాసాలు ఉన్నవాళ్లకు, చెడు అలవాట్లు ఉన్నవాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని చాణక్య నీతి చెబుతోంది. డబ్బు ఉన్నవాళ్లు సంపదను అవమానించడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. పొదుపు చేస్తూ అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేస్తే మాత్రమే అనుకూల ఫలితాలు ఉంటాయి.