Morning Breakfast: ఈ రోజుల్లో చాలా మంది అనారోగ్య సమస్యలో బాధపడుతున్నారు. పోషకాలు ఉండే సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు ఉండే సరైన ఆహారం తప్పకుండా తీసుకోవాలి. ఈ రోజుల్లో ఉదయం రకరకాల టిఫిన్లు వచ్చేశాయి. కానీ పూర్వం రోజుల్లో ఎక్కువగా చద్దన్నం తినేవారు. దీన్ని ఉదయం పూట తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటంతో పాటు రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా వ్యవసాయం చేసేవారు రోజూ ఉదయం పూట ఈ చద్దన్నం తినేవారు. దీన్ని తిని పొలం పనులు చేయడం వల్ల రోజంతా ఎలాంటి నీరసం లేకుండా యాక్టివ్‌గా ఉంటారు. ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగించే గుణాలు ఈ చద్దన్నంలో ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. డైలీ ఉదయం టిఫిన్‌గా చద్దన్నం తినడం అలవాటు చేసుకుంటే దీర్ఘకాలిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే డైలీ ఉదయం పూట చద్దన్నం తింటే ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం.
బరువు తగ్గడం
చద్దన్నంలో ఫైబర్ ఎక్కువగా కేలరీలు తక్కువగా ఉంటాయి. దీన్ని ఉదయం పూట తినడం వల్ల పొట్ట నిండుగా ఉంటుంది. దీంతో మీకు ఆకలి నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజూ ఉదయం పూట చద్దన్నం తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా బరువు తగ్గుతారు.
జీర్ణ సమస్యల నుంచి విముక్తి
చద్దన్నంలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. పొట్ట సమస్యలు, అజీర్ణం, కడుపు ఉబ్బరం అన్ని సమస్యల నుంచి కూడా చద్దన్నం విముక్తి కలిగిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడేవారికి చద్దన్నం బాగా సాయపడుతుంది. డైలీ ఉదయం తినడం వల్ల ఎలాంటి నొప్పి లేకుండా మలవిసర్జన అవుతుంది.
గుండె ఆరోగ్యం
ఇందులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుంది. డైలీ చద్దన్నం తినడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. ఈ రోజుల్లో చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ ప్రమాదాల బారి నుంచి విముక్తి చెందాలంటే చద్దన్నం తప్పకుండా తినాల్సిందే.
ఎముకల ఆరోగ్యం
చద్దన్నంలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే కండరాలు బలంగా ఉండటానికి కూడా ఈ చద్దన్నం బాగా ఉపయోగపడుతుంది. ఉదయం పూట చద్దన్నం తినడం వల్ల రోజంతా యాక్టివ్‌గా కూడా ఉంటారు. నీరసం, అలసట వంటివి లేకుండా ఎనర్జీటిక్‌గా ఉంటారు.
మానసిక ఆరోగ్యం
కొందరు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు రోజూ ఉదయం పూట చద్దన్నం తినడం వల్ల తొందరగా విముక్తి చెందుతారు. ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురి కాకుండా సంతోషంగా ఉంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.