Mobile: ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయింది. మొబైల్ లేకుండా కనీసం ఒక్క క్షణం కూడా ఉండలేరు. ఏం పనిచేయకుండా 24 గంటలు కూడా కొందరు మొబైల్‌తోనే గడుపుతున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ప్రతి నిమిషం కూడా మొబైల్‌లోనే ఉంటున్నారు. భోజనం చేసినప్పుడు, చదివినప్పుడు, వంట చేసినప్పుడు ఆఖరుకి బాత్‌రూమ్‌లో ఉన్నప్పుడు కూడా మొబైల్‌ను వదలడం లేదు. కేవలం పెద్దవాళ్లు అనే కాకుండా పిల్లలు కూడా మొబైల్ ఎక్కువగా చూస్తున్నారు. ఎవరైనా కూడా మొబైల్‌ను కొంత లిమిట్ వరకు మాత్రమే ఉపయోగించాలి. లిమిట్ ఎక్కువ అయితే అనారోగ్య సమస్యలు బారిన పడతారు. ముఖ్యంగా పిల్లలు అయితే అసలు మొబైల్ చూడకూడదు. కానీ ఈ రోజుల్లో పిల్లలు వీటికి బానిస అవుతున్నారు. పెద్దవాళ్లు ఎక్కువగా మొబైల్ చూస్తే పిల్లలు తక్కువ సమయం చూడాలి. మరి ఎవరి వయస్సుకు ఎంత సమయం పాటు మొబైల్ చూడాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రెండేళ్లకు ముందు ఇవ్వకూడదు
రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలుకు తల్లిదండ్రులు అసలు మొబైల్ ఇవ్వకూడదు. పిల్లలు చిన్న వయస్సులో ఎక్కువగా మొబైల్ చూస్తే కళ్ల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు వారి బిజీ లైఫ్ వల్ల పిల్లలకు మొబైల్ ఇస్తున్నారు. దీంతో పిల్లలు మొబైల్స్‌కి బానిసలా తయారవుతున్నారు. కాబట్టి పిల్లలు మారం చేశారని వారికి అసలు మొబైల్ ఇవ్వద్దు.
రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు
ఈ వయస్సు మధ్య ఉన్న పిల్లలకు రోజుకి కేవలం గంటపాటు మాత్రమే ఇవ్వాలి. అవసరమైతే ఇంతకంటే తక్కువగా ఇవ్వాలి. మొబైల్స్ ఇచ్చి గేమ్స్ ఆడించడం కంటే మీరే పిల్లలతో గేమ్స్ ఆడటం వంటివి చేయడం వల్ల పిల్లలు అన్నింట్లో యాక్టివ్‌గా ఉంటారు. అదే మొబైల్ ఎక్కువగా చూడటం వల్ల మానసిక సమస్యలతో ఇబ్బంది పడతారు.
8 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు వారు
ఈ వయస్సు ఉన్నవారు రోజుకి రెండు గంటలు మాత్రమే మొబైల్ ఉపయోగించాలి. ఎక్కువగా ఉపయోగించడం వల్ల కంటి సమస్యలు రావడంతో పాటు చదువు దెబ్బతింటుంది. ఏ విషయంపై కూడా ఇంట్రెస్ట్ చూపించలేరు. 18 ఏళ్లు పైబడిన వారు రోజుకి ఒక మూడు గంటలు మాత్రమే చూడాలి. అంతకంటే ఎక్కువ సమయం చూస్తే తలనొప్పి, కళ్ల నొప్పి వంటివి వస్తాయి. అలాగే నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎక్కువ సమయం చూడటం వల్ల నష్టాలు
మొబైల్‌ను ఎక్కువ గంటలు చూడటం వల్ల ఇతరులతో కలిసి మాట్లాడలేరు. నిజం చెప్పాలంటే వారికి మాట్లాడే ఆసక్తి తగ్గిపోతుంది. కేవలం మొబైల్ చూసుకుని ఉండాలని అనుకుంటారు. పెద్దవాళ్లే అని కాకుండా పిల్లల్లో కూడా ఈ సమస్యలు వస్తాయి. బాడీకి శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఒత్తిడి, ఆందోళన పెరిగి మానసిక సమస్యలతో ఇబ్బంది పడతారు. ఇది చెడు అలవాట్లకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.