Mobile Dementia: ప్రస్తుతం రోజుల్లో మొబైల్ వాడని వాళ్లు ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా మొబైల్‌కి బాగా ఎడిక్ట్ అయిపోయారు. ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు మొబైల్ వాడటమే కొందరి పని. ప్రస్తుతం అయితే ఇన్‌స్టాలో రీల్స్ చూస్తూ రోజంతా టైమ్ పాస్ చేస్తుంటారు. పొద్దున్న లేచిన వెంటనే రీల్స్ చూడటం స్టార్ట్ చేస్తారు. ఇక రోజంతా అదే పని. ఇలా మొబైల్ ఎక్కువగా చూడటం వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఒత్తిడి పెరిగి మానసికంగా కూడా ఇబ్బంది పడతారు. ఈ విషయాలు తెలిసిన కూడా మొబైల్ చూడటం మాత్రం మానరు. అయితే మొబైల్ పట్టుకునే పొజిషన్ వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరికి ఎలా పట్టుకోవాలో తెలియక నచ్చినట్టుగా మొబైల్ పట్టుకుని గంటల తరబడి రీల్స్ చూస్తారు. దీనివల్ల డిమెన్షియా వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ డిమెన్షియా అంటే ఏమిటి? దీనివల్ల ఆరోగ్యానికి ఏదైనా నష్టం వాటిల్లుతుందా? పూర్తి వివరాలు స్టోరీలో తెలుసుకుందాం.
కొందరు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ చూసినప్పుడు తల, చేతుల భంగిమలను మార్చి పెడుతుంటారు. గంటల తరబడి తప్పుుడు భంగిమలో ఉండటం వల్ల శరీరంలో వైకల్యం, మతిమరుపు వంటివి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనినే డిమెన్షియా వ్యాధి అని అంటారు. ఈ వ్యాధికి ఇప్పటి వరకు ఎలాంటి చికిత్స లేదు. ఈ వ్యాధి బారిన పడితే చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మొబైల్ చూసేటప్పుడు వంకరగా కాకుండా సరైన భంగిమలో పట్టుకోవాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు ఉండవు. ఇలా తప్పుుడు భంగిమలో మొబైల్ పట్టుకోవడం వల్ల మెదడులో రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అలాగే ఇది డిమెన్షియా నరాల సంబంధిత వ్యాధులకు కూడా కారణమవుతుంది. కాబట్టి సరైన భంగిమలో మాత్రమే మొబైల్‌ను వాడటం అలవాటు చేసుకోండి.
కొందరు చేతిలో మొబైల్ పట్టుకుంటారు. కానీ తల మాత్రం వేరే దగ్గర ఉంటుంది. దీంతో మెదడులోని రక్తనాళాలపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల మెదడులో ఉండే ధమనులు కుంచించుకుని పోతాయి. దీంతో మెదడుకి సరిగ్గా రక్తప్రసరణ జరగదు. ఇక మెదడులోని కణాలు బలహీన పడి, డిమెన్షియా వ్యాధి వస్తుంది. కాబట్టి తల ఒక దగ్గర, మొబైల్ ఒక దగ్గర పెట్టుకుని కంపార్ట్ లేకుండా వాడవద్దు. ఈ మొబైల్స్ ఎక్కువగా వాడటం వల్ల చాలా మంది అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతుంది. కాబట్టి మొబైల్ ఫోన్ వాడేటప్పుడు తల వంచకూడదు. దీనివల్ల కేవలం డిమెన్షియా వ్యాధి మాత్రమే కాకుండా ఇతర సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మెడ, తలపై ఎలాంటి ఒత్తిడి పడకుండా మొబైల్ చూడటం అలవాటు చేసుకోవడం ఉత్తమం. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.