Mobile Charger: మొబైల్ ఛార్జర్ కు టేప్ వేసి వాడితే ఎంత డేంజరో తెలుసా?

అయితే ఒక్కోసారి ఛార్జింగ్ కనెక్ట్ చేసే ప్రదేశంలో డ్యామేజ్ గురి అవుతూ ఉంటుంది. కొత్త ఛార్జర్ కొనలేక కొందరు దీనికే టేప్ వేసి వాడుతూ ఉంటారు. అయితే ఇలా వాడడం వల్ల ప్రమాదమని అంటున్నారు.

Written By: Chai Muchhata, Updated On : March 19, 2024 10:12 am

Mobile charger tape

Follow us on

Mobile Charger:  నేటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ తప్పనిసరిగా ఉంటుంది. స్కూల్ కెళ్లే విద్యార్థుల నుంచి బడా వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరికీ మొబైల్ అవసరం ఉంటోంది. ఒక్కోసారి మొబైల్ లేకపోతే రోజు గడవదు అన్నట్లుగా మారిపోయింది. ఈ తరుణంలో మొబైల్ ను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మొబైల్ ఛార్జింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొంత మంది మొబైల్ ను ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ పెడుతారు. అలాగే నకిలీ చార్జర్ లను ఉపయోగిస్తారు. వీటితో మొబైల్ తొందరగా పాడవుతుంది. ఇంకా కొందరు బ్రాండెడ్ ఛార్జర్ వాడినా.. అవి డ్యామేజ్ అయిన స్థానంలో టేప్ వేసి మరీ వాడుతారు. ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మొబైల్ ఛార్జింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఫోన్ బ్యాటరీ తొందరగా పాడవుతుంది. దీంతో ఎంత సేపు ఛార్జింగ్ పెట్టినా కనీసం 50 శాతం కూడా దాటదు. సాధారణంగా ఫోన్ నుంచి వచ్చే హీట్ ను తగ్గించుకోవడానికి మొబైల్ లో ఎలాంటి పరికరాన్ని అమరుస్తారో అందుకు తగ్గట్టే ఫోన్ ఛార్జర్ కూడా తయారు చేస్తారు. అందువల్ల ఏ కంపెనీ ఫోన్ అయితే కొంటున్నామో అందుకు తగ్గట్టే ఛార్జర్ ను వాడడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా నకిలీ చార్జర్ వాడడం వల్ల బ్యాటరీ పాడవుతుంది.

నకిలీ ఛార్జర్ వాడడం వల్ల బ్యాటరీ ఉబ్బడమే కాకుండా రేడియేషన్ కు గురైన ఒక్కోసారి ఫోన్ పేలే అవకాశం ఉంది. ఇలా పేలకపోయినా కొన్ని సార్లు ఫోన్ హ్యాంగ్ కావడమే కాకుండా సాప్ట్ వేర్ సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల మొబైల్ వాడే వారు తప్పనిసరిగా బ్రాండెడ్ లేదా ఫోన్ కు అనుగుంగా ఉండే చార్జర్ మాత్రమే వాడాలని మైబైల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ఫోన్ బ్యాటరీ పాడవడానికి ఇలాంటి కారణాలే ఎక్కవ అని అంటున్నారు.

ఇక కొందరు బ్రాండెడ్ ఛార్జీలు వాడుతూ ఉంటారు. అయితే ఒక్కోసారి ఛార్జింగ్ కనెక్ట్ చేసే ప్రదేశంలో డ్యామేజ్ గురి అవుతూ ఉంటుంది. కొత్త ఛార్జర్ కొనలేక కొందరు దీనికే టేప్ వేసి వాడుతూ ఉంటారు. అయితే ఇలా వాడడం వల్ల ప్రమాదమని అంటున్నారు. యునిటైడ్ కింగ్ డమ్ లోని ఎలక్ట్రికల్ సేప్టీ ఇనిస్టిట్యూట్ పరిశోధనల్లో తేలింది. తాత్కాలికంగా రిపేర్ చేసిన ఛార్జర్లు వాడితే పేలిపోవడం ఖాయం అని అంటున్నారు. ఇలాంటి ఘటనల్లో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.