Vastu Tips: అద్దం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. మనిషి ప్రతిబింబాన్ని చూసుకోవాలంటే ఇది ఉండాల్సిందే. అయితే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కునేవారికి ఎన్నో పరిష్కార మార్గాల ద్వారా వాటినుంచి బయటపడవచ్చు. అందులో అద్దం ఒకటి. ఇంతకీ ఈ అద్దం ఎక్కడ పెట్టాలి? ఇంట్లో గానీ ఆఫీసులో గానీ ఏ దిషలో ఉంటే మంచిది. ఎక్కడ దీన్ని అమర్చవచ్చు. అద్దం వల్ల ఎలాంటి ప్రతికూల, అనకూల పరిస్థితులు ఉంటాయో తెలుసుకుందాం..
అద్దాన్ని ఇంటి ఉత్తరం లేదా తూర్పు గోడలపై గాజు ఫోటోలను గానీ అద్దాలను గానీ అమర్చవచ్చు. అద్దాలను పశ్చిమ, దక్షిణ దిశ గోడలపై ఉంచకూడదు. అద్దాన్ని సరైన స్థలంలో ఉంచకపోతే అనేక పరిమాణాలు సంభవిస్తాయి. ఒకే సమయంలో ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేసే రెండు అద్దాలను ఒకదానికొకటి ఎదురుగా ఉంచవద్దు. అద్దాన్ని నేల నుంచి 4 నుంచి 5 అడుగుల దూరంలో ఉండేలా చూసుకోండి. ఇంట్లో అదృష్టం ఉండాలి అంటే కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలలో అద్దాలను ఉంచవచ్చు.
డ్రెస్సింగ్, టాయిలెట్ తో పాటు డైనింగ్ ఏరియాల్లో అద్దాలను వేలాడదీయవచ్చు. దీని వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాత పెరుగుతుందట. ఇక వంటగదిలో మాత్రం అద్దం ఉంచకూడదు. ఇక మంచం ప్రతిబింబం కనిపించేలా మాత్రం అద్దం ఉంచకూడదట. చతురస్రాకార, దీర్ఘచతురస్రాకార ఆకృతులకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుండాలి. రౌండ్, ఓవల్ గ్లాసెస్ వి మంచివి కాదు కాబట్టి ఈ అద్దాలను నివారించాలి.ఇక డబ్బు వృధా అవుతుందా? అయితే డబ్బు ఖర్చు అవకూడదు అనుకుంటున్నారా?
మీ లాకర్ లో అద్దాన్ని ఉంచండి. దీని వల్ల సంపద పెరుగుతుందట. అప్పుల సమస్య నుంచి దూరం అవుతారు. ఇక అద్దాలను మాత్రం భద్రంగా ఉంచాలి. ఇక అద్దాల విషయానికి వస్తే ప్రతిబింబం ముఖ్యం. ఏదైనా వస్తువు ప్రతికూలంగా కనిపిస్తే.. దాని ముందు అద్దం ఉంచడం వల్ల ప్రతికూలత తొలిగిపోతుందట. అలాగే మెయిన్ డోర్ ముందు ఎలాంటి అద్దాలు, గాజులు లేదా మెరిసే వస్తువులు పెట్టకూడదు.