https://oktelugu.com/

Mini Switzerland: దేశంలో మినీ స్విట్జర్లాండ్ పోదామా.. ఇంతకీ ఎక్కడుందంటే?

భారతదేశంలో ఉంటూనే తక్కువ బడ్జెట్‌లో స్విట్జర్లాండ్‌ను ఆస్వాదించాలనుకుంటే మీకు ఈ మినీ స్విట్జర్లాండ్ గురించి చెప్పాల్సిందే. దేశంలో ఉండే కొన్ని ప్రదేశాలను మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మరి ఆ ప్రదేశాలు ఏవో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 10, 2024 / 01:43 AM IST

    Mini Switzerland

    Follow us on

    Mini Switzerland: ప్రయాణాలు చేయడం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని, అక్కడ వాతావరణాన్ని ఆస్వాదించాలని అనుకుంటారు. దేశంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇన్నీ పక్కన పెడితే విదేశాలకు వెళ్లాలని చాలా మంది కోరుకుంటారు. విదేశాల్లో ముఖ్యంగా స్విట్జర్లాండ్ వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. లైఫ్‌లో ఒక్కసారైనా స్విట్జర్లాండ్‌ను సందర్శించాలనే కలలు కంటారు. కానీ బడ్జెట్ లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల చాలా మంది తమ కలHను నెరవేర్చుకోలేకపోతున్నారు. విదేశాలకు వెళ్లేటప్పుడు బడ్జెట్ సరిపోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇండియాలోనే ట్రిప్‌లకు వెళ్తే ఎక్కువగా ఖర్చు అవుతుంది. అలాంటిది ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే ఎంత అవుతుందో ఆలోచించాల్సిందే. మరి మీరు భారతదేశంలో ఉంటూనే తక్కువ బడ్జెట్‌లో స్విట్జర్లాండ్‌ను ఆస్వాదించాలనుకుంటే మీకు ఈ మినీ స్విట్జర్లాండ్ గురించి చెప్పాల్సిందే. దేశంలో ఉండే కొన్ని ప్రదేశాలను మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మరి ఆ ప్రదేశాలు ఏవో ఈ స్టోరీలో చూద్దాం.

    ఖజ్జియార్
    హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఖజ్జియార్‌ను మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడి ప్రకృతి అందాలు అన్ని కూడా అచ్చం స్విట్జర్లాండ్ లానే అనిపిస్తుంది. ఈ ప్లేస్‌కి చాలా మంది హనీమూన్‌కి వెళ్తుంటారు. చూడటానికి ఎంతో మనోహరంగా ఉండే ప్లేస్‌లో మీకు ప్రశాంతత దొరుకుతుంది. స్విట్జర్లాండ్ వెళ్లాలనే మీ కోరిక తక్కువ బడ్జెట్‌లో తీరుతుంది.

    ఔలి
    ఉత్తరాఖండ్‌లో ఉన్న ఔలి చమోలి జిల్లాలో ఉంది. స్కీయింగ్ కోసం పర్యాటకుల ఎక్కువగా ఇక్కడికి వెళ్తుంటారు. ఈ ప్రదేశం ఎక్కువగా మంచుతో కప్పబడి ఉంటుంది. మీరు ఇక్కడ ఉంటే మీకు స్విట్జర్లాండ్‌లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో అయితే మంచుతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడికి వెళ్తే మీకు స్విట్జర్లాండ్ వెళ్లినట్లు ఉంటుంది. అలాగే ఖర్చు కూడా తక్కువగా అవుతుంది.

    యుమ్‌తంగ్ వ్యాలీ
    సిక్కింలో యుమ్‌ తంగ్ వ్యాలీ కూడా చూడటానికి స్విట్జర్లాండ్‌లా ఉంటుంది. అక్కడికి వెళ్లిన కూడా స్విట్జర్లాండ్ ఫీల్‌ను పొందవచ్చు. యుమ్‌తంగ్ వ్యాలీని ఫ్లవర్స్ లోయ అని కూడా అంటారు. ఇది ఉత్తర సిక్కింలో ఉంది. సిక్కింలోని అత్యంత అందమైన లోయ ఏది అంటే ఆలోచించకుండా యుమ్‌తంగ్ వ్యాలీ అని చెప్పవచ్చు. ఈ లోయలో ఎక్కువగా పువ్వులు కనిపిస్తాయి. హిమాలయాల్లో కనిపించే అనేక రకాల పుష్పాలు ఇక్కడ ఉంటాయి. వీటిని చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి.

    కౌసని
    ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ జిల్లాలో ఉండే ఒక హిల్ స్టేషన్ కౌసని. ఇక్కడికి ఎక్కువగా టూరిస్ట్‌లు వెళ్తుంటారు. ఈ కౌసనిలో సందర్శించడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో అనశక్తి ఆశ్రమం, కౌసని టీ ఎస్టేట్, సుమిత్రా నందన్ పంత్ మ్యూజియం, బైజ్నాథ్ ఆలయం, రుద్రధారి జలపాతం, గుహలు వంటివి ఉన్నాయి. వీటిని చూడటానికి టూరిస్ట్‌లు ఎక్కువగా వెళ్తుంటారు.