Milk: పాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. అయితే ఈ రోజుల్లో చాలా రకాల పాలు వచ్చేశాయి. కానీ పూర్వం రోజుల్లో మాత్రం ఆవు, గేదె, మేక పాలు దొరికేవి. ముఖ్యంగా ఆవు పాలు అయితే అందరూ కూడా వాడుతారు. ఆరోగ్యానికి మంచిదని వీటిని తాగడం లేదా నెయ్యి చేయడం వంటివి చేస్తుంటారు. పాలలో అధికంగా ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సహాయపడుతుంది. పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల వారి కండరాలు చిన్నప్పటి నుంచి బలంగా తయారవుతాయి. ఏ వయస్సు వారైన కూడా పాలు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. పాలు తాగడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం పూట పాలు తాగడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. నిద్రలేమి సమస్యలకు కూడా పాలు బాగా పనిచేస్తాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో రకరకాల పాల ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. ఇందులో ఏవి ఆరోగ్యానికి మంచిదో కూడా తెలియదు. అసలు ఏ పాల ప్యాకెట్ దేనికి వాడాలి? ఏవి వాడితే ఆరోగ్యానికి మంచిదో ఈ స్టోరీలో చూద్దాం.
ఫుల్ క్రీమ్ మిల్క్
మార్కెట్లో ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది దొరుకుతుంది. ఈ పాలలో ఎక్కువగా క్రీమ్ ఉంటుంది. ఎక్కువగా ఫ్యాట్ కూడా ఈ పాలలో ఉంటుంది. ఈ పాలను ఎక్కువగా పాశ్చరైజ్ చేయించి ఇందులోని బ్యాక్టీరియాను తొలగిస్తారు. అయితే ఈ ఫుల్ క్రీమ్ పాలను ఎక్కువగా పిల్లలు, ఫిట్‌నెస్ పాటించే వాళ్లు తాగుతుంటారు. ఒక గ్లాసు ఫుల్ క్రీమ్ మిల్క్‌లో దాదాపుగా 3.5 శాతం కొవ్వు ఉండటంతో పాటు 150 కేలరీలు ఉంటాయి. అయితే ఈ ఫుల్ క్రీమ్ పాలలో మళ్లీ రెండు రకాలు ఉన్నాయి. అందులో ఒకటి స్టాండర్డైజ్డ్ పాలు కాగా.. రెండోది హోమోజెనైజ్డ్ పాలు.
సింగిల్ టోన్డ్ మిల్క్
నీటిలో స్కిమ్డ్ మిల్క్‌ను కలిపి సింగిల్ టోన్డ్ మిల్క్ తయారు చేస్తారు. ఈ పాలలో దాదాపుగా 3 శాతం వరకు కొవ్వు ఉంటుంది. ఈ పాలు శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది. ఒక గ్లాసు సింగిల్ టోన్డ్ మిల్క్‌లో దాదాపుగా 120 కేలరీలు ఉంటాయి.
డబుల్ టోన్డ్ మిల్క్
స్కిమ్డ్ పాలలో హోల్ పాలను కలిపి డబుల్ టోన్డ్ మిల్క్‌ను తయారు చేస్తారు. ఇందులో 1.5 శాతం వరకు కొవ్వు ఉంటుంది. ఈ పాలు బరువు తగ్గడానికి బాగా పనిచేస్తాయి.
స్కిమ్డ్ మిల్క్
ఈ మిల్క్‌లో 0.3 నుంచి 0.1 శాతం వరకు కొవ్వు ఉంటుంది. ఇందులో మినరల్స్, విటమిన్ల వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. స్కిమ్డ్ మిల్క్‌లో దాదాపుగా 75 కేలరీలు ఉంటాయి. మిగతా పాలతో పోలిస్తే ఈ పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.