Metabolic syndrome: ప్రస్తుతం మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కొందరు ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. పోషకాలు ఉండే సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కొన్ని ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారు. అలాంటి వాటిలో మెటబాలిక్ సిండ్రోమ్ ఒకటి. దీని గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ జీవనశైలిలో మార్పుల వల్ల దీని బారిన పడతారు. ఈ మధ్య కాలంలో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. జీవక్రియలో జరిగే ఇబ్బందుల వల్ల గుండె పోటు, షుగర్ వ్యాధి, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం, కొవ్వు ఏర్పడటం వంటి సమస్యల బారిన పడతారు. వీటి వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదామా? దీనివల్ల కలిగే నష్టాలేంటి? ఈ సమస్య నుంచి బయట పడటం ఎలాగో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ మెటబాలిక్ సిండ్రోమ్ వ్యాధి బారిన పడుతున్న సంఖ్య దేశంలో రోజురోజుకీ పెరుగుతుంది. ఈ వ్యాధి చిన్న వయస్సులో ఉన్నవారిని దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేలా చేస్తుంది. ఈ సమస్య ఉన్నవారు ఏ పనిని సరిగ్గా చేయలేరు. ఎప్పుడు ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎక్కువగా ఈ సమస్య ఊబకాయం ఉన్నవారికి వస్తుంది. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడ్డారా? లేదా? అని చెక్ చేయడానికి బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా తెలుసుకుంటారు. ఈ బాడీ మాస్ ఇండెక్స్ 25 కంటే తక్కువగా ఉంటే వారు మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడినట్లు నిర్థారణ చేసుకోవచ్చు. వయస్సు పెరిగే కొద్ది కూడా ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మెటబాలిక్ సిండ్రోమ్ వంశపారంపర్యంగా కూడా వస్తుందని నిపుణులు అంటున్నారు. కుటుంబంలో ఎవరికైనా ఊబకాయం, డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటివి ఉన్నట్లయితే వస్తుంది.
ముఖ్యంగా ఈ సిండ్రోమ్ జీవనశైలి వల్ల వస్తుంది. కొందరు తక్కువగా శారీరక శ్రమ చేయడం, అసలు బాడీకి ఎలాంటి కష్టం లేకుండా ఉండటం, ఎక్కువగా కూర్చోవడం వంటి ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సిండ్రోమ్ వస్తుంది. ఈ సిండ్రోమ్ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. దీనిని తగ్గించుకోవాలంటే మందులు వాడటంతో పాటు జీవనశైలిలో మార్పులు తప్పకుండా చేయాలి. ముఖ్యంగా ప్రొటీన్, ఫైబర్ ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. తృణధాన్యాలు, బ్రౌన్ రైస్ వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. ఫాస్ట్‌ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వేయించిన ఆహార పదార్థాల జోలికి పోకూడదు. వీటితో పాటు శారరీ శ్రమ బాడీకి అందాలి. రోజూ ఒక 30 నిమిషాల పాటు వ్యాయామ చేయడం, ఏరోబిక్ వ్యాయామం, డ్యాన్స్, యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. ఎలాంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోతే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.