https://oktelugu.com/

Mental Health: మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 5 చిట్కాలు పాటించాల్సిందే!

మరి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. అప్పుడే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మరి మానసిక సమస్యల నుంచి విముక్తి చెందాలంటే తప్పకుండా ఈ పాటించాల్సిన చిట్కాలేంటో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 12, 2024 / 04:28 PM IST

    mental health

    Follow us on

    Mental Health: భూమి మీద ఉన్న మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. మానసికంగా సంతోషంగా ఉండటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఈ రోజుల్లో అందరూ బిజీ లైఫ్‌లో ఉండి చాలా మంది ఎక్కువగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ సమయం నిద్రపోకుండా, వర్క్ బిజీలో ఆందోళనకు గురి అయ్యి చివరకు డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. ఇలా చివరికి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. దీని నుంచి బయటకు రావాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అయిన కూడా మానసిక సమస్యలను పెంచుకుంటున్నారు. కానీ వీటిని తగ్గించడానికి అసలు ప్రయత్నించడం లేదు. ఇప్పుడున్న జనరేషన్‌లో చాలా మంది కంప్యూటర్లకు అతుక్కుని కూర్చొంటున్నారు. దీంతో మానసికంగా సంతోషంగా ఉండటం లేదు. దీనివల్ల చివరకు లేని పోని అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటున్నారు. మరి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. అప్పుడే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. మరి మానసిక సమస్యల నుంచి విముక్తి చెందాలంటే తప్పకుండా ఈ పాటించాల్సిన చిట్కాలేంటో చూద్దాం.

    మీ మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి
    మనస్సును ఆందోళనగా కాకుండా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఎంత వర్క్ బిజీలో ఉన్న కూడా అప్పుడప్పుడు వ్యాయామం, స్విమ్మింగ్, యోగా వంటివి చేసి మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటే సంతోషాన్నిచ్చే పనులు చేయడం ఉత్తమం. కొందరికి బయటకు వెళ్తే మనస్సు ప్రశాంతంగా ఉంటే.. మరికొందరికి షాపింగ్, సినిమాలు ఇలా ఒక్కోటి ఉంటుంది. మీకు ఏది మనస్సుకు ప్రశాంతత ఇస్తుందో అది చేయాలి.

    మీ ఎమోషన్స్‌ను షేర్ చేసుకోండి
    సంతోషం వచ్చిన, బాధ వచ్చిన నచ్చిన వ్యక్తితో షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం ఇష్టం లేకపోతే, షేర్ చేసుకోవడానికి ఎవరూ లేకపోతే పేపర్‌పైన రాసుకోండి. మీకు సంతోషం అనిపించిన వాటిని లేదా బాధగా అనిపిస్తే ప్రతి ఫీలింగ్, ఎమోషన్‌ను షేర్ చేసుకుంటే కాస్త బాధ తప్పుతుంది. రోజూ ఉదయం లేదా రాత్రి పూట ఇలా చేయడం వల్ల ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు.

    ఎక్కువగా ఆలోచించవద్దు
    అధికంగా ఆలోచిస్తే లేని పోని ఆలోచనలు పెరుగుతాయి. దీనివల్ల బాగా ఒత్తిడికి గురవుతారు. బాధపెట్టే ఆలోచనలు ఎక్కువగా వస్తే వెంటనే వాటిని తగ్గించడానికి ప్రయత్నించండి. దీనికోసం పాటలు పాడటం, వినడం, డ్యాన్స్ వంటివి చేస్తూ ఆలోచనలను తగ్గించాలి.

    రేడియేషన్‌ను దూరంగా..
    ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా మొబైల్, ల్యాప్‌టాప్ వంటివి చూడటం వల్ల ఇవి ఒత్తిడిని పెంచుతున్నాయి. గంటల తరబడి వీటిని చూడటం వల్ల కళ్లు బాగా ఒత్తిడికి గురై.. మానసికంగా ఇబ్బందిగా పడతారు. కాబట్టి స్క్రీన్‌కి కొంత సమయం కేటాయించాలి. ఆ సమయం తర్వాత అసలు వాడకూడదు. అప్పుడే మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.

    కలివిడిగా ఉండాలి
    ఒత్తిడి నుంచి విముక్తి చెందాలంటే ముఖ్యంగా అందరితో కలిసి మెలసి ఉండాలి. మానసికంగా సంతోషంగా ఉండాలంటే అందరిలో మాట్లాడాలి. అప్పుడే ఎలాంటి ఒత్తిడులు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.