Mental Health: కొందరికి ఒంటరిగా ఉంటేనే ఇష్టం. మరికొందరికి ఏకాంతంగా ఉంటే ఇష్టముంటుంది. అయితే చాలా మంది ఒంటరిగా ఉంటూ ఇదే ఏకాంతం అని తెగ ఫీల్ అయిపోతుంటారు. ఏకాంతానికి, ఒంటరితనానికి చాలా తేడా ఉంది. కానీ వీటి మధ్య ఉన్న తేడాలు చాలా మందికి పెద్దగా తెలియదు. కొందరికి చుట్టూ ఎంతమంది మనుషులు ఉన్నా కూడా ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. కొన్నిసార్లు ఒంటరితనం బాగానే అనిపిస్తుంది. కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం ఒంటరితనం అసలు నచ్చదు. ఈ రోజుల్లో చాలా మంది ఒంటరిగా ఉంటున్నారు. కానీ అందులో ఏకాంతం, సంతోషం ఉండవు. అంటే ఒంటరితనంలో ఇవేవి ఉండవా అనే డౌట్ వచ్చిన ఆశ్చర్య పోవక్కర్లేదు. ఎందుకంటే ఒంటరితనంలో బాధ, దుఃఖం, ఆవేదన, ఒత్తిడి మాత్రమే ఉంటాయి. చాలా మంది ఒంటరిగా చాలా హ్యాపీగా ఉన్నామని ఫీల్ అవుతుంటారు. మరి అయితే ఏకాంతానికి, ఒంటరితనానికి అసలు తేడా ఏంటి? ఏది మంచిదనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఒంటరితనం అంటే?
ఒంటరితనం అంటే ఎవరూ లేకుండా మీరు ఒక్కరు మాత్రమే ఉండటం. సాధారణంగా ఎలాంటి గొడవలు లేకుండా ఒంటరిగా ఉండాలని చాలా మంది ఇష్టపడతారు. కానీ చివరకు మానసిక సమస్యలతో ఇబ్బంది పడతారు. ఎందుకంటే మనకి సంతోషం వస్తే షేర్ చేసుకోవడానికి ఎవరూ లేకపోయిన.. బాధ వస్తే మాత్రం షేర్ చేసుకోవడానికి ఎవరో ఒకరూ ఉండాలి. అన్ని విషయాలు అందరితో షేర్ చేసుకోలేం. కానీ మన ఎమోషన్స్ అన్నింటిని షేర్ చేసుకోవడానికి తప్పకుండా ఒక వ్యక్తి ఉండాలి. ఎవరూ మీ బాధను చెప్పుకోవడానికి లేకపోతే మీరు బాధపడుతుంటారు. దీన్నే ఒంటరితనం అంటారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
ఏకాంతం అంటే?
ఒంటరితనంలో ఎవరూ ఉండరు. అలాగే సంతోషంగా ఉండరు. కానీ ఏకాంతంలో అలా కాదు.. ఎవరూ ఉండకపోయిన చాలా సంతోషంగా ఉంటారు. మనిషి రోజంతా ఎంత బిజీగా ఉన్నా కూడా ఎంతో కొంత సమయం ఏకాంతాన్ని కోరుకుంటాడు. ఏకాంతంలో ఉన్నప్పుడు ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు ఉండవు. మీ లైఫ్‌లో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ దగ్గర ఏం లేదనే బాధ ఉండదు. మీ పనులు చేసుకుని మీరు హాయిగా ఉంటారు. మీకు మీరే కావాలని ఇలా ఏకాంతం కోరుకుని ఉంటే ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఇతరులను పట్టించుకోకపోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వీరికి ఎవరి సాయం అక్కర్లేదు. వారికి వారే చాలా సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిస్తారు. మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. అయితే ఎంత ఏకాంతంలో ఉన్నా కూడా ఏదైనా చిన్న సమస్య వల్ల ఒంటరితనానికి గురైతే మాత్రం మళ్లీ సమస్యలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఏకాంతంగా ఉండటానికి మెడిటేషన్, యోగా వంటివి చేయడం అలవాటు చేసుకోండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోగలరు.