Menarche: జీవనశైలిలో మార్పుల వల్ల ఈ రోజుల్లో అమ్మాయిలు చిన్న వయస్సులోనే రజస్వల అవుతున్నారు. వీటికి ముఖ్యకారణం మారిన జీవనశైలి, ఆహారంలో మార్పులు అని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అమ్మాయిలు 10 నుంచి 15 ఏళ్ల వయస్సులో రజస్వల అవుతుంటారు. కానీ ప్రస్తుతం పదేళ్లు నిండకుండానే రజస్వల అవుతున్నారు. వీటిన్నింటికి శరీరంలో జరిగే మార్పులని నిపుణులు అంటున్నారు. అయితే ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా సోషల్ మీడియాలోనే ఎక్కువగా గడుపుతున్నారు. సమయం తెలియకుండా రోజంతా కూడా మొబైల్ పట్టుకుని అలా రీల్స్ చూడటమే పని పెట్టుకున్నారు. అయితే రోజులో ఎక్కువ సమయం మొబైల్ చూడటం వల్ల ఆ రేస్ కళ్లపై పడతాయి. దీనివల్ల కంటి సమస్యలు వస్తాయని తెలిసిన కూడా కొందరు వినకుండా అదే పని చేస్తుంటారు. ఎక్కువగా మొబైల్‌కి ఎడిక్ట్ కావడం వల్ల కళ్ల సమస్యలతో పాటు మానసిక సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయితే ఇలా మొబైల్ ఎక్కువగా చూడటం వల్ల అమ్మాయిల రజస్వలలో కూడా మార్పులు వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గంటలు తరబడి ఎక్కువ సమయం పాటు మొబైల్ చూడటం వల్ల అమ్మాయిల శరీరంలోని హార్మోన్‌లో మార్పులు వస్తాయి. వీటివల్ల అమ్మాయిలు చిన్న వయస్సులోనే రజస్వల అవుతారు. ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు పదేళ్లకే రజస్వల అవుతున్నారు. ఈ బ్లూ రేస్ వల్ల ఇంకా రెండు మూడేళ్లు ముందే రజస్వల అవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అమ్మాయిలు గంటలు తరబడి ఒకే ప్లేస్‌లో కూర్చోని మొబైల్ చూడటం వల్ల ఆ కిరణాలు ఎఫెక్ట్ వల్ల ఇంకా తొందరగా రజస్వల అవుతారు. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచి మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండేలా అలవాటు చేయండి. కేవలం ఇవే కాకుండా చాలా కారణాలు ఉన్నాయి.
ప్రాసెస్ చేసిన ఫుడ్ ఎక్కువగా తినడం, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం తినడం వల్ల, కృత్రిమ పదార్థాల వల్ల కొందరు అమ్మాయిలు తొందరగా రజస్వల అవుతున్నారు. అలాగే జీవనశైలిలో మార్పులు, వాతావరణంలో కాలుష్యం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా అమ్మాయిలు తొందరగా రజస్వల అవుతున్నారు. మరి చిన్న వయస్సులో రజస్వల కావడం వల్ల పిల్లలకు సరిగ్గా ఏది తెలియడం లేదు. అయితే ఇవే కాకుండా బరువు తక్కువ ఉన్న పిల్లలతో పోలిస్తే ఎక్కువ ఉన్న పిల్లలు తొందరగా మెచ్యూర్ అవుతారు. నిద్రలేమి వల్ల కూడా తొందరగా రజస్వల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఎందుకంటే నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీనివల్ల కూడా తొందరగా రజస్వల అవుతారు. కొందరు పిల్లలు చిన్న వయస్సులోనే ఎక్కువగా ఒత్తిడికి, ఆందోళనకు గురవుతారు. ఇలాంటి అమ్మాయిలు తొందరగా రజస్వల అయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.