Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్.. ఈ పేరు వినగానే ఆడవారికే వస్తుంది అన్న అభిప్రాయం ఇప్పటి వరకు ఉంది. ఇందుకు కారణం బ్రెస్ట్ క్యాన్సర్లలో 99 శాతం ఆడవారు కావడమే. అయితే వైద్యులు మగవారికీ బ్రెస్డ్ కార్యన్సర్ వస్తుందంటున్నారు. ఇప్పటి వరకు నిర్ధారణ అయిన బ్రెస్ట్ క్యాన్సర్లలో 99 శాతం మహిళలు అయితే.. ఒక శాతం పురుషులు కూడా ఉన్నట్లు పేర్కొంటున్నారు. మధ్య , తూర్పు ఆఫ్రికాలో మగవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో నిర్ధారణ అయింది. మగవారు కూడా స్త్రీల తరహాలోనే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్, మెడికల్ ఆంకాలజీ విభాగం (ఐఓఎస్పీఎల్) సీనియర్ కన్సల్టెంట్ – విభాగాధిపతి డాక్టర్ కుమార్‌దీప్ దత్తా చౌదరి తెలిపారు. వెయ్యి మందిలో రొమ్ము క్యాన్సర్ బాధితుల్లో ఒక పురుషుడు ఉంటున్నట్లు వెల్లడించారు.
ముందుగా గుర్తించే విధానం..
స్త్రీలకు ఉన్నట్టుగా పురుషులలో ముందస్తుగా వ్యాధిని గుర్తించే స్క్రీనింగ్ విధానాలు లేవు. పురుషులలో రొమ్ము క్యాన్సర్ కు కారణమయ్యే కారకాలు.. వయసు అనేది ముఖ్యమైన అంశం. 60 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్కులు దీని బారిన పడే అవకాశం ఉంది. కుటుంబంలో ఎవరైనా స్త్రీకి రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉంటే అది మగవారికి కూడా ప్రమాదాన్ని పెంచుతుంది. ఛాతీపై రేడియేషన్ చికిత్స చేస్తే రొమ్ము క్యాన్సర్ అభివృద్ధికి కారణమవుతుంది. హార్మోన్ చికిత్సలు, పరిస్థితిలు, అంటువ్యాధులు లేదా కొన్ని విషాల వల్ల కూడా సంభవించే అవకాశం ఉంది. మగ హార్మోన్ స్థాయిలని ప్రభావితం చేసే క్లైన్ ఫెల్టర్స్ సిండ్రోమ్ వంటి పరిస్థితులు కూడా ప్రమాదాన్ని పెంచుతాయంటున్నారు. ఈస్ట్రోజెన్ సప్లిమెంట్లు తీసుకోవడం కూడా రొమ్ము కణజాలంపై ప్రభావం చూపుతాయి. కాలేయ సిర్రోసిస్ వ్యాధులు ప్రమాదానికి దోహదపడతాయి.
ఊబకాయంతో క్యాన్సర్ ముప్పు..
ఊబకాయం మగ వారిలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. లక్షణాలు గుర్తించడం ఎలా..స్త్రీలు అనుభవించినట్టే మగవారి రొమ్ములో కూడా గడ్డలు ఏర్పడతాయి. రక్తస్రావం, చనుమొలలో మార్పులు సంభవిస్తాయి. రొమ్ము ప్రాంతం చుట్టు ఉన్న చర్మంలో మార్పులు, అసౌకర్యం, నొప్పి కూడా వస్తుంది.
పురుషుల్లో కనిపించే లక్షణాలు..
ఇన్వాసివ్ డక్టల్ కార్సినోమా.. ఇది నాళాలలో ఉద్భవించే క్యాన్సర్ కణాలను కలిగి ఉంటుంది. ఈ క్యాన్సర్ కణాలు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే అవకాశం ఉంది. డక్టల్ కార్సినోమా (డీసీఐఎస్). ఈ డీసీఐఎస్ అనేది రొమ్ము పరిస్థితిని సూచిస్తుంది. క్యాన్సర్ కణాలు నాళాల లైనింగ్ కు మాత్రమే పరిమితం చేయబడి ఉంటాయి.
రోగనిర్ధారణతో నివారణ…
రోగ నిర్ధారణ రొమ్ము క్యాన్సర్ జయించడంలో కీలక పాత్ర పోషించేది ముందస్తుగా వ్యాధిని గుర్తించడమే. పైన చెప్పిన విధంగా ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. మగవారిలో రొమ్ము క్యాన్సర్ ని నిర్ధారించడంలో మొదటి దశ శారీరక పరీక్ష. రొమ్ములో ఏవైనా ముద్దలు, మార్పులు కనిపిస్తే వెంటనే పరీక్షక్ చేయించుకోవాలి.
ఇమేజింగ్ పరీక్ష..
మమోగ్రఫీ, రొమ్ము ఎక్స్‌రేతో కణితులు గుర్తించవచ్చు. అయితే వీటికి మమోగ్రామ్‌ల ద్వారా బయట పడకపోవచ్చు. అల్ట్రా సౌండ్, ఏంఆర్‌ఐ వంటి ఇమేజింగ్ పరీక్షలు సిఫార్సు చేస్తారు. బయాప్సీ..ఇమేజింగ్ పరీక్షలో ఏదైన తేడాగా అనిపిస్తే క్యాన్సర్ కణాల ఉనికిని నిర్ధారించడం కోసం బయాప్సీ చేస్తారు. రొమ్ము ప్రాంతం నుంచి చిన్న కణజాలం తీసుకుని పరీక్ష చేస్తారు. హిస్టోపాథాలజీ..బయాప్సీ తర్వాత కణజాల నమూనా పాథాలజిస్ట్ కి పంపిస్తారు. కణితి రకం,గ్రేడ్ ని వాళ్లు మైక్రో స్కోప్ ద్వారా పరిశీలిస్తారు. హార్మోన్ టెస్ట్.. క్యాన్సర్ కణాలలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉన్నాయో లేదో తెలుసుకోవడం కోసం హార్మోన్ టెస్ట్ కీలకం.