https://oktelugu.com/

Henna leaves: గోరింటాకు తినవచ్చా? తింటే చనిపోతామా?

సాధారణంగా అన్ని ఆకు కూరలను తింటారు. దీనివల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి గోరింటాకును ఎందుకు తినరు? ఒకవేళ తింటే ఏమవుతుంది? ప్రాణం పోతుందా? అనే సందేహం మనలో చాలా మందికి ఉంది. మరి దీని గురించి పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 2, 2025 / 02:50 AM IST

    Henna leaves

    Follow us on

    Henna leaves:హెన్నా(గోరింటాకు) గురించి అందరికీ తెలిసిందే. ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయిన కూడా అమ్మాయిలకు గోరింటాకు లేకపోతే అసలు రెడీ అయిన ఫీలింగ్ ఉండదు. చేతులు, కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల అందంగా కనిపిస్తారు. అయితే మనలో చాలా మందికి ఒక సందేహం వచ్చి ఉంటుంది. సాధారణంగా అన్ని ఆకు కూరలను తింటారు. దీనివల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి గోరింటాకును ఎందుకు తినరు? ఒకవేళ తింటే ఏమవుతుంది? ప్రాణం పోతుందా? అనే సందేహం మనలో చాలా మందికి ఉంది. మరి దీని గురించి పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.

    హెన్నాను తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గోరింటాకు చేతులకు, జుట్టుకు మాత్రమే మేలు చేస్తుంది. కానీ ఆరోగ్యానికి కాదు. చేతులు, కాళ్లకు పెట్టుకుంటే మంట తగ్గుతుంది. అదే తింటే మాత్రం కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు కండరాల సమస్యలు, మూత్రపిండాలు అనారోగ్య బారిన పడటం, ఎర్ర రక్తకణాలు నాశనం కావడం, కొన్నిసార్లు మరణానికి కూడా దారితీస్తుంది. ఈ హెన్నా చెట్టుకి కేవలం ఆకులు మాత్రమే కాకుండా చిన్న కాయలు కూడా ఉంటాయి. వీటిని కూడా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులోని రసాయనాల వల్ల కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్లు వంటివి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో లాసోన్ అనే ఒక సమ్మేళనం ఉంటుంది. ఇది చాలా విషపూరితం. దీన్ని తినడం వల్ల ఒక్కసారిగా చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గోరింటాకును తినకూడదు. ఒకవేళ తింటే మాత్రం వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

    హెన్నాను జుట్టుకి అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. జుట్టు దెబ్బతినకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తుగా పెరుగుతుంది. కానీ తింటే మాత్రం చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొద్ది మొత్తంలో అయిన గోరింటాకును తినడం వల్ల కడుపులో గ్యాస్ట్రిక్ ఏర్పడటంతో పాటు మూత్రపిండాలు దెబ్బతింటాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కూడా అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం చర్మం, జుట్టుకు మాత్రమే గోరింటాకు మంచిదని నిపుణులు అంటున్నారు. చర్మానికి గోరింటాకు అప్లై చేయడం వల్ల బాడీకి చలవ చేస్తుంది. ఏవైనా పుండ్లు, మంట, దురద ఉన్నా కూడా తొలగిపోతాయి. అందుకే కొందరు కాళ్లు సాధారణంగా ఏదైనా చిన్న దెబ్బ తగిలితే గోరింటాకు పూస్తుంటారు. నెలకు ఒకసారి అయిన చేతులకు, కాళ్లకు, జుట్టుకు అప్లై చేయడం వల్ల సమస్యలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.