https://oktelugu.com/

Meditation: ధ్యానం చేయడానికి సరైన సమయం ఏది? ఉదయమా లేక సాయంత్రమా?

రోజులో కనీసం పది నిమిషాలు అయిన ధ్యానం చేస్తే ఉన్న టెన్షన్‌లు అన్ని తొలగిపోతాయి. కొన్ని నియమాలు పాటిస్తూ ధ్యానం చేయడం వల్ల జీవితంలో ఎన్నో విజయాలు కూడా సాధించవచ్చు. మరి ధ్యానం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి? ఏ సమయంలో ధ్యానం చేయడం ఉత్తమం? ఉదయమా లేక సాయంత్రమా? అనే విషయాలు పూర్తిగా ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 13, 2024 / 05:25 PM IST

    Meditation

    Follow us on

    Meditation: వ్యక్తిగత కారణాలు, వర్క్‌లో ఒత్తిడి, మానసిక సమస్యలు అన్నింటి నుంచి విముక్తి కావడానికి చాలా మంది యోగా, ధ్యానం వంటివి చేస్తుంటారు. డైలీ ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు ఎలాంటి ఒత్తిడిల నుంచి అయిన బయటపడటానికి ఎక్కువగా ధ్యానం చేస్తారు. ధ్యానం చేయడం వల్ల ఆలోచన శక్తి మారుతుంది. మనస్సు హాయిగా ఉండటంతో పాటు మానసికంగా సంతోషంగా ఉంటారు. ఆలోచనలను నియంత్రణలో పెట్టుకుంటారు. రోజులో కనీసం పది నిమిషాలు అయిన ధ్యానం చేస్తే ఉన్న టెన్షన్‌లు అన్ని తొలగిపోతాయి. అయితే కొందరు ఏదో ధ్యానం చేయాలని మాత్రమే చేస్తారు. ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలో కూడా సరిగ్గా తెలియదు. దీనివల్ల చేసిన ప్రతిఫలం తెలియదు. చేయాల్సిన సమయంలో కొన్ని నియమాలు పాటిస్తూ ధ్యానం చేయడం వల్ల జీవితంలో ఎన్నో విజయాలు కూడా సాధించవచ్చు. మరి ధ్యానం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి? ఏ సమయంలో ధ్యానం చేయడం ఉత్తమం? ఉదయమా లేక సాయంత్రమా? అనే విషయాలు పూర్తిగా ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    ఏ సమయంలో ధ్యానం చేయాలంటే?
    రోజులో ఏ సమయంలో అయిన ధ్యానం చేయవచ్చు. కాస్త ఒత్తిడి, ఆందోళనగా ఉన్న ప్రతీసారి ధ్యానం చేయవచ్చు. కానీ ఎక్కువగా ఉదయం పూట చేయడం వల్ల మీకు రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఉదయం పూట అప్పుడే లేవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ స్వచ్ఛమైన గాలి, ప్రశాంత వాతావరణం వల్ల రిలాక్స్‌గా ధ్యానం చేసుకుంటారు. ఈ సమయంలో చేయడం వల్ల పరధ్యానం నుంచి బయట పడతారు. ఇది మీ ఆలోచన శక్తిని మెరుగుపరుస్తుంది. ఏ విషయానికైనా ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యంగా ఉదయం ఐదు గంటల సమయంలో ధ్యానం ఇంకా మంచిది. ఈ సమయంలో చేస్తే మీలో జరిగే మార్పులు మీరే చూస్తారు

    ఎంతసేపు ధ్యానం చేయాలి?
    ధ్యానం ఒక్కోరు వారి సమయాన్ని బట్టి చేస్తారు. అయితే ప్రతీ రోజు దాదాపుగా 20 నుంచి 30 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఎలాంటి ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు. ఒకేసారి ఎక్కువ సమయం చేయలేమని అనుకునే వారు కుదిరిన ప్రతీసారి పది నిమిషాలు.. ఇలా మూడు సార్లు చేసిన ఫలితం ఉంటుంది.

    ఎలా ధ్యానం చేయాలంటే?
    చాలామంది ఏదో పేరుకి ధ్యానం చేశామని చేస్తారు. కానీ ఇలా అసలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల ధ్యానం చేసిన రిజల్ట్ ఉండదు. ధ్యానం చేసేటప్పుడు శబ్ధం లేకుండా ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో చేయాలి. గదిలో కాకుండా బయట వాతావరణంలో చేయడం ఉత్తమం. ధ్యానం చేసేటప్పుడు చాలా ఆలోచనలు వస్తాయి. అవన్నీ వచ్చిన కూడా మధ్యలో వదలపెట్టకుండా ధ్యానం చేయాలి. పనికిరాని విషయాల గురించి ఆలోచించకూడదని మనస్సులో చెప్పుకుని ధ్యానం చేయాలి. నెగిటివ్ కాకుండా పాజిటివ్ ఎక్కువగా అనుకుంటూ ధ్యానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. జీవితంలో ఏవైనా సాధించాలంటే అవి ధ్యానంతో పూర్తవుతాయి. కోపం ఎక్కువగా ఉన్నవారికి కోపం తగ్గడం, మనస్సు ప్రశాంతంగా ఉండటం, మానసికంగా సంతోషంగా ఉంటారు. కాబట్టి రోజుకి కనీసం పది నిమిషాలైన ధ్యానం చేయడం ఆరోగ్యానికి మంచిది.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.