https://oktelugu.com/

Meditation: మెడిటేషన్‌తో ఈజీగా వెయిట్ లాస్.. ఎలాగంటే?

బరువు పెరిగిన తర్వాత తగ్గడానికి మళ్లీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మందులు వాడటం, ప్రొటీన్ పౌడర్లు వంటివి వాడుతున్నారు. వీటి వల్ల బరువు తగ్గడం పక్కన పెడితే అనారోగ్య సమస్యల బారిన పడతారు. వీటికి బదులు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచే చేసే మెడిటేషన్‌తో ఈజీగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి మెడిటేషన్‌తో ఎలా బరువు తగ్గవచ్చో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 7, 2025 / 11:42 PM IST

    Meditation

    Follow us on

    Meditation: ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఉరుకుల పరుగులతో నడుస్తుంది. ప్రతీ ఒక్కరూ కూడా వారి లైఫ్‌లో బిజీ ఉంటున్నారు. కనీసం రెండు అడుగులు కూడా వేయడానికి సమయం లేనంత బిజీగా ఉన్నారు. అయితే బాడీకి శారీరక వ్యాయామం లేకపోవడం వల్ల కొందరు ఎక్కువగా బరువు(Weight) పెరుగుతున్నారు. దీనికి తోడు పోషకాలు ఉండే ఆరోగ్యమైన ఆహారం(Food) కంటే బయట దొరికే ఫాస్ట్‌ఫుడ్‌ను(Fast Food) అధికంగా తింటున్నారు. వీటివల్ల కొందరు ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అధికంగా బరువు పెరగడం వల్ల కేవలం ఊబకాయం మాత్రమే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలు(Health Issues) కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయిన కూడా కొందరు బయట తినడం మానరు. ఇలా బరువు పెరిగిన తర్వాత తగ్గడానికి మళ్లీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మందులు వాడటం, ప్రొటీన్ పౌడర్లు వంటివి వాడుతున్నారు. వీటి వల్ల బరువు తగ్గడం పక్కన పెడితే అనారోగ్య సమస్యల బారిన పడతారు. వీటికి బదులు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచే చేసే మెడిటేషన్‌తో ఈజీగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి మెడిటేషన్‌తో ఎలా బరువు తగ్గవచ్చో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

    మైండ్ ఎంత రిలాక్స్‌గా ఉంటే అంత ఈజీగా బరువు తగ్గుతారట. ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా తొందరగా బరువు పెరుగుతారు. కాబట్టి ప్రతీ చిన్న విషయానికి కూడా ఎక్కువగా టెన్షన్ కాకుడదు. రోజూ తప్పనిసరిగా మెడిటేషన్ చేయాలి. అది కూడా ఎలాగంటే దాదాపుగా 30 నిమిషాల పాటు ఎలాంటి గొడవలు లేని ప్రదేశంలో మాత్రమే చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే ఈజీగా బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో లేదా బయట పార్క్‌లో వెంటిలేషన్ ఉండే ప్రదేశంలో ఏం ఆలోచించకుండా మీకు కంఫర్ట్ ఉండే పొజిషన్‌లో కూర్చోవాలి. నడము వంచకుండా తిన్నగా కూర్చోని ఒత్తిడిని బయటకు పంపించాలి. కళ్లు మూసుకుని, నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ.. వదలడం వల్ల మీకు వేరే దాని మీదకు దృష్టి వెళ్లదు. ఏం ఆలోచించకుండా కేవలం మెడిటేషన్ మీద మాత్రమే ఆలోచన పెట్టడం వల్ల మీరు ఎలాంటి ఒత్తిడికి గురి కారు. దీంతో ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

    మెడిటేషన్ చేయడం వల్ల కేవలం బరువు మాత్రమే తగ్గకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి మానసిక సమస్యలు లేకుండా చాలా స్మార్ట్‌గా ఉంటారు. ఎలాంటి సమస్యను అయిన కూడా ఈజీగా సాల్వ్ చేసుకోగలరు. తొందరగా ప్రతీ విషయానికి రియాక్ట్ కారు. అలాగే చర్మ, జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. స్కిన్ మెరుస్తుంది. తొందరగా వృద్ధాప్య ఛాయలు కూడా రావు. మెడిటేషన్ వల్ల బాడీలోని అన్ని అవయవాలు కూడా సక్రమంగా పనిచేస్తాయి. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. మెడిటేషన్ మైండ్‌ని రిఫ్రెష్ చేయడంతో పాటు బాడీని కూడా రిఫ్రెష్ చేస్తుంది. ఎలాంటి కొవ్వు కూడా శరీరంలోకి చేరకుండా ఉంచుతుంది. దీంతో మీ బరువు నియంత్రణలో ఉంటుంది.