Best Cars: భారతీయుల్లో కార్లు కొనాలనుకునే ఆశలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.కరోనా తరువాత అవసరాల రీత్యా సొంత వెహికిల్ ను కలిగి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ కంపెనీకి చెందిన రెండు మార్లు వినియోగదార్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అద్భుతమైన పీచర్స్ తో పాటు మైలేజ్ ఎక్కువగా ఇవ్వడంతో ఆ కార్లను ఎలాగైనా దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇంతకీ ఆ కార్లలో ఉన్న స్పెషలేంటి? వాటి ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయి? ఆ వివరాల్లోకి వెళ్దాం..
దేశీయ కార్ల ఉత్పత్తిల్లో మారుతి సుజుకీ అగ్రగామిగా నిలుస్తుంది. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీల వరకు అన్ని రకాల మోడళ్లను బయటకు తీసుకొస్తూ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటోంది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయినా రెండు మోడళ్లు వినియోగదారులు విపరీతంగా ఆకర్షిస్టున్నాయి. అంతేకాకుండా వీటి ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి. అయితే ఇందులో ఒకటి హ్యాచ్ బ్యాక్ ఉండగా.. మరొకటి ఎస్ యూవీ వేరియంట్ లో ఆకర్షిస్తోంది. దీంతో మిడిల్ క్లాస్ నుంచి రిచ్ వారికి ఇవి బెస్ట్ అప్షన్ గా చెప్పుకోవచ్చు.
మారుతి సుజుకీ నుంచి విడుదలై ఆకర్షిస్తున్న హ్యాచ్ బ్యాక్ కారు బాలెనో. ఇది 1.2 లీటర్ నేచుల్ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. 90 బీహెచ్ పీ, 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పెట్రోల్ తో పాటు సీఎన్జీ వెర్షన్ ను కూడా కలిగి ఉంది. దీని ధర రూ.6.61 లక్షల నుంచి ప్రారంభమై రూ.9.88 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇదే పీచర్స్ ఉన్న హ్యాందాయ్ ఐ 20, టాటా ఆల్ట్రోజ్, టయోటా గ్లాంజాతో బాలెనో పోటీపడుతోంది. ఇక ఇందులో హెడ్ ఆప్ డిస్ ప్లే, 360 డిగ్రీ కెమెరా, ఫాస్ట్ చార్జింగ్ యూఎస్ బీ లు సౌకర్యవంతంగా ఉంటాయి.
మారుతి నుంచి మరో బెస్ట్ మోడల్ వ్యాగన్ ఆర్. దేశంలో మిగతా కంపెనీల కంటే అత్యధికంగా అమ్ముడు పోయిన కార్లలో వ్యాగన్ ఆర్ మాత్రమే అని అంటారు. ఇది 1.2 లీటర్ పెట్రోల్ 88.5 బీహెచ్ పీ, 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని రూ.6.57 లక్షల ప్రారంభం ధర ఉంది. 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే, 4 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో వంటి ఫీచర్లు అద్భుతంగా పనిచేస్తాయి.