Car Sales In July 2023: 2023 జూన్ నెలలో కార్లపై మక్కువ పెంచుకున్నవారు జూలైకొచ్చేసరికి మనసు మార్చుకున్నారు. ఆ కొన్ని బ్రాండ్లను ఎగబడి కొనుక్కున్నారు. కానీ జూలై నెలకొచ్చేసరికి పరిస్థితి తారుమారైంది. నెంబర్ 1 స్థానంలో ఉన్న మోడళ్లు దిగజారిపోయాయి. మిగతా కంపెనీకి చెందిన కొన్ని బ్రాండ్లు సైతం ఇదే బాట పట్టాయి. అయితే కొన్ని మాత్రం అమ్మకాల జోరు సాగించాయి. రెగ్యులర్ బ్రాండ్ ను కాదని 7 సీటర్ కార్లపై ఇంట్రెస్ట్ పెట్టారు. దీంతో ఈ నెలలో ఎప్పటికీ నెంబర్ వన్ రేసులో ఉండే వాగనార్, నెక్సాన్ అమ్మకాలు దిగువకు పడిపోయాయి.
మారుతి నుంచి రిలీజ్ అయ్యే ఏ మోడల్ కైనా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టే వాళ్లు చాలా మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ నుంచి రిలీజ్ అయిన వ్యాగనార్ జూన్ లో అమ్మకాల జోరు సాగించింది. ఈ నెలలో ఇది 17,481 యూనిట్లు విక్రయించింది. దీంతో మిగతా కంపెనీలను తోసుకుంటూ నెంబర్ 1 స్థానానికి ఎగబాకింది. కానీ జూలై నెలకొచ్చేసరికి ఇవి 12,970 మాత్రమే విక్రయించిది. దీంతో ఇది 8వ స్థానానికి పడిపోయింది. ఇదే బాటలో నెక్సాన్ కూడా జూన్ లో వ్యాగనార్ కు పోటీగా జూన్ లో 13,827 యూనిట్లు విక్రయించింది. కానీ జూలైకొచ్చేసరికి 12,349 విక్రయాలతో 7వ స్థానం నుంచి 9వ స్థానానికి పడిపోయింది. అంటే దాదాపు 10.5 శాతం అమ్మకాలు క్షీణించాయని తెలుస్తోంది.
ఇదే సమయంలో మారుతి నుంచి కొన్ని కార్లు జూలైలో నెంబర్ వన్ క్యాటగిరీకి వెళ్లాయి. సబ్ కాంపాక్ట్ అయిన ఎస్ యూవీ కారు స్విప్ట్ జూలైలో 17,896 యూనిట్లు అమ్ముడుపోయాయి. దీంతో అన్నింటికంటే ముందు వరుసలో స్విప్ట్ కొనసాగింది. దీనితో పాటు మారుతీ నుంచి బాలెనో 16,725, బ్రెజ్జా 16,543 యూనిట్లు విక్రయించాయి. ఈ కారణంగా నెంబర్ 2, 3 పొజిషన్ కు వచ్చాయి. ఇక 7 సీటర్ ఎర్టిగా సైతం 14,352 యూనిట్ల అమ్మకాలతో 4వ స్థానంలో ఉంది. ఆ తరువాత మారుతి కాంపాక్ట్ సెడాన్ డిజైర్ 13,395 యూనిట్లు అమ్మాయి.
జూలై నెలలో మారుతి, టాటాలు పోటీ పడినా మారుతికి సంబంధించిన కొన్ని మోడళ్లు దూసుకెళ్లాయి. కానీ ఎవర్ గ్రీన్ గా ఉన్న వ్యాగనార్ ను మాత్రం కస్టమర్లు వద్దనుకుంటున్నారు. అయితే జూలైలో వచ్చిన క్షీణత ఏడాదిపాటు కొనసాగుతుందని ఆటోమోబైల్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. జూన్ నుంచి జూలై మధ్య 25.8 శాతం క్షీణత పెరిగింది. ఇదే కొనసాగితే ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.