Maruti Suzuki: కార్లు కొనేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. దీంతో కొన్ని కంపెనీలు వినియోగదారులకు అనుగుణంగా కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇదే సమయంలో తక్కువ ధరకు విక్రయించడం తో పాటు సందర్భాన్ని భట్టి భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. దేశీయ కార్ల కంపెనీలో అగ్రగామిగా నిలిచిన మారుతి సుజుకి తాజాగా బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఈ కంపెనీకి చెందిన కొన్ని కార్లను కొనుగోలు చేస్తే ఏకంగా రూ.40 వేల వరకు క్యాష్ బ్యాక్ వస్తుందని ప్రకటించింది. ఇవి సెప్టెంబర్ నెలలోపే వర్తిస్తాయని తెలిపింది. ఇప్పటికే మారుతి కంపెనీ నుంచి వివిధ మోడళ్లు మార్కెట్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో రావడంతో వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. మరి ఆ డిస్కౌంట్ లభించే కార్లు ఏవో తెలుసా?
మారుతి సుజుకీ నుంచి రిలీజ్ అయిన ఆల్టో సక్సెస్ ఫుల్ మోడల్ అని అనిపించుకుంది. ఇది అప్డేట్ ఫీచర్స్ తో ఆల్టో కె 10 కారుపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఈ కారు 1.0 లీటర్, 3 సిలిండర్ కె 10 సి పెట్రోల్ ను కలిగి ఉంటుంది. 67 హెచ్ పి పవర్ ను, 89 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు బేస్ మోడల్ రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ మోడల్ పై గరిష్టంగా రూ.32 వేల వరకు తగ్గింపు ధరను పొందవచ్చని మారుతి సుజుకి తెలిపింది.
మారుతి నుంచి మరో లేటెస్ట్ మోడల్ ‘సెలెరియో’ పై కూడా భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. 1.0 లీటర్ పెట్రోల్ ను కలిగిన ఇంజిన్ 67 హెచ్ పి పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్ బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిని 5.37 లక్షల నుంచి రూ.7.15 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ మోడల్ హఐ ఎండ్ పై ఏకంగా రూ.40 వేలు తగ్గింపు ధరను పొందవచ్చు. బేస్ మోడల్ పై రూ.30 వేలు తగ్గించే అవకాశం ఉంది.
మారుతి సుజుకి S మోడల్ లోనూ తగ్గింపు ధరను ప్రకటించారు. దీని బేస్ వేరియంట్ ను రూ.6.12 లక్షలతో విక్రయిస్తున్నారు. ఈ మోడల్ పై రూ.30 వేల వరకు తగ్గించనున్నారు. మారుతి నుంచి వ్యాగన్ ఆర్ మొన్నటి వరకు నెంబర్ వన్ గా నిలిచింది. పెట్రో, సీఎన్ జీ వేరియంట్లు గా ఉన్న ఈ మోడల్ పై రూ.30 వేల తగ్గింపును ప్రకటించారు. అలాగే వ్యాగన్ ఆర్ బేస్ వేరియంట్ పై రూ.35 వేలు తగ్గించనున్నట్లు ప్రకటించారు.