
Maruti Suzuki Cars : భారతీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకీ ఇటీవల 25 లక్షల కార్లను విదేశాలకు ఎగుమతి చేసి రికార్డు నెలకొల్పింది. దీంతో కంపెనీపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ ఈ కంపెనీకి చెందిన వ్యాగన్ ఆర్, ఆల్టో K10 మోడళ్లకు గ్లోబల్ ఎన్సీపీ (Global NCAP) తక్కువ రేటు ఇచ్చింది. సేప్టీ ఫీచర్లలో ఈ రెండు అత్యంత క్షీణ దశలో ఉన్నట్లు పేర్కొంది. గ్లోబల్ ఎన్సీపీ (Global NCAP) ఇచ్చే స్టార్ రేటింగ్స్ తోనే కార్ల కొనుగోలుపై వినియోగదారులు ఇంట్రెస్ట్ పెడుతారు. అయితే ఇప్పుడు మారుతి సుజుకికి వచ్చిన రేటింగ్ పై సర్వత్రా చర్చ సాగుతోంది.
సామాన్యుడికి అందుబాటులో ఉండే మారుతి కార్లలో సేఫ్టీ ఫీచర్లను తక్కువ అని గ్లోబల్ ఎన్సీపీ (Global NCAP) ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రతీ కారుకు జీరో నుంచి 5 వరకు రేటింగ్ ఇస్తారు. 5 స్టార్ రేటింగ్ పొందిన కారులో సేఫ్టీ జర్నీ ఉంటుందని ప్రయాణికులు భావిస్తారు. కానీ కార్ల కంపెనీ దిగ్గజం మోడళ్లు వ్యాగన్ ఆర్ కు -1, ఆల్టో K10- 2 రేటింగ్ ఇచ్చారు. చైల్డ్ ఆక్యుపెుంట్ ప్రొటెక్షన్ రెండు కార్లలో జీరోగా నమోదు చేశారు. నిన్నటి వరకు అత్యధికంగా అమ్మడుపో వాటిలో ఈ రెండే అధికంగా ఉన్నాయి. కానీ సేఫ్టీ విషయంలో గ్లోబల్ ఎన్సీపీ (Global NCAP) ఇచ్చిన ఈ రేటుపై తీవ్ర చర్చ సాగుతోంది.
మారుతి సుజుకి ఆల్టో K10 లో పెద్దలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయంటున్నారు. ముందువైపు చాతి భాగం నుంచి తలవరకు కొంచెం ప్రొటెక్షన్ ఉన్నా.. పక్కవైపు సరైన రక్షణ లేదని గ్లోబల్ ఎన్సీపీ (Global NCAP) తెలిపింది. వ్యాగన్ ఆర్ లో డ్రైవర్ కు చాతి భాగంలో ప్రొటెక్షన్ కరువైందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తమ సంస్థ నిర్వహించిన పరీక్షల్లో ఫోక్ష్ వేగన్ విర్టస్, స్కోడా స్లేవియా 5 స్టార్ రేటింగ్ వచ్చాయని తెలిపింది. వ్యాగన్ ఆర్ కు -1, ఆల్టో K10- 2 రేటింగ్ ఇచ్చామని పేర్కొన్నారు.
మారుతి కంపెనీ కార్లకు ఈ రేటింగ్ ఇవ్వడం పై కంపెనీ యాజమాన్యం స్పందించింది. భారతీయులను దృష్టిలో పెట్టుకొని తమ కార్లను ఉత్పతి చేస్తున్నామని చెప్పుకొచ్చింది. ఇక్కడి వారికి అనుగుణంగా సేప్టీ ఫీచర్లు ఉన్నాయని ఇందులో ఎలాంటి డౌట్ లేదని పేర్కొంది. ప్రయాణికులు ఇవి సౌకర్యవంతంగా ఉన్నాయని ఆదరించడం ద్వారానే ఈ మోడళ్లు అత్యధికంగా అమ్ముడుపోతున్నాయని తెలిపింది. ప్రయాణికుల భద్రతే మా లక్ష్యం అని పేర్కొంది.