https://oktelugu.com/

Marriage: యువతకు ఎందుకు పెళ్లిళ్లు కావడం లేదు.. సమాజం ధోరణి ఎలా ఉంది?

మారుతున్న జీవనశైలి, పెళ్లి ఇష్టం లేకపోవడం, సమాజంలో జరుగుతున్న సంఘటనల వల్ల ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం వంటి కారణాల వల్ల పెళ్లికి యువత నిరాకరిస్తోంది. దేశంలో పెళ్లికి నిరాకరిస్తున్న యువత రోజురోజుకీ పెరుగుతుంది. అసలు ఎందుకు యువతకు పెళ్లిళ్లు కావడం లేదు? దీనికి గల కారణాలు ఏంటి? జనరేషన్ ప్రభావమా? జీవనశైలి అలవాట్లు? అసలైన కారణం ఏంటో తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 15, 2024 / 05:19 AM IST

    Marriage

    Follow us on

    Marriage: ప్రతీ ఒక్కరికి జీవితంలో తోడు తప్పకుండా ఉండాలి. చిన్నప్పటి నుంచి ఎంత ఒంటరిగా ఉన్నా కూడా ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవాలి. పూర్వం రోజుల్లో అయితే సరైన వయస్సులో పెళ్లి చేసుకునే వారు. కానీ ప్రస్తుతం రోజుల్లో అయితే 30 ఏళ్లు వచ్చిన కూడా పెళ్లి ప్రస్తావనే ఉండదు. డబ్బు, కెరీర్ అంటూ పెళ్లిని పక్కకి పెట్టేస్తున్నారు. ఇంతకు ముందు అమ్మాయిలు లేదా అబ్బాయిలు పెళ్లి అంటే ఎలాగైనా 30 ఏళ్ల లోపల చేసుకునేవారు. సామాన్యులు 25ఏళ్లలోగా చేసుకుంటే.. సెలబ్రిటీలు కనీనం 30కి అయిన పెళ్లికి చేసుకునేవారు. కానీ ఇప్పుడు 40 ఏళ్లకు చేరింది. మారుతున్న జీవనశైలి, పెళ్లి ఇష్టం లేకపోవడం, సమాజంలో జరుగుతున్న సంఘటనల వల్ల ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం వంటి కారణాల వల్ల పెళ్లికి యువత నిరాకరిస్తోంది. దేశంలో పెళ్లికి నిరాకరిస్తున్న యువత రోజురోజుకీ పెరుగుతుంది. అసలు ఎందుకు యువతకు పెళ్లిళ్లు కావడం లేదు? దీనికి గల కారణాలు ఏంటి? జనరేషన్ ప్రభావమా? జీవనశైలి అలవాట్లు? అసలైన కారణం ఏంటో తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.

    ఆర్థిక సమస్యలు కూడా ఓ కారణమే..
    దేశంలో యువత పెళ్లికి నిరాకరించడానికి ముఖ్య కారణం ఆర్థిక సమస్యలు. ఎందుకంటే నిశ్చితార్థం నుంచి మొదలైన ఖర్చు ఆగకుండా జీవితాంతం ఉంటుంది. అమ్మాయి లేదా అబ్బాయి అయిన కూడా ఆర్థిక సమస్యలతో ఉంటే పెళ్లి చేసుకున్న వారిని సంతోషంగా చూడలేమని ఫీల్ అవుతారు. దేశంలో చాలా మంది యువత చాలా తక్కువ జీతం నెలకు సంపాదిస్తున్నారు. వచ్చిన జీతం వారి ఖర్చులకే సరిపోదు. ఇంకా పెళ్లి అంటే భార్య, పిల్లలు, వారి చదువులు, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వనప్పుడు పెళ్లి ఎందుకని ఆలోచించి పెళ్లి విషయంలో ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే అన్ని పనులు జరుగుతాయి. భాగస్వామి విషయంలో అందం, గుణం కంటే ఆస్తినే చూస్తున్నారు. అమ్మాయి అయిన, అబ్బాయి అయిన కూడా ఆర్థికంగా సెటిల్ కావాలని చూస్తున్నారు. దీంతో ఉద్యోగం, వ్యాపారం, కెరీర్ అని పెళ్లికి నిరాకరిస్తున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

    భయపెట్టిస్తున్న సంఘటనలు
    సమాజంలో జరుగుతున్న సంఘటనల వల్ల యువత భయపడుతోంది. పెళ్లి చేసుకున్న వారి కంటే చేసుకోని వారే సంతోషంగా ఉంటున్నారు. అందుకే యువత పెళ్లి చేసుకోకుండా ఉండటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఒకవేళ పెళ్లి చేసుకున్న గొడవలు, ఏడుపులతో పెద్దది చేసుకుని విడాకులు తీసుకుంటున్నారు. పెళ్లి చేసుకుని కనీసం ఏడాది కాకుండానే విడాకులు తీసుకుంటున్నారు. పెళ్లి చేసుకుని విడిపోయే దానికి ఎందుకని యువత పెళ్లికి నిరాకరిస్తున్నారు. వీటితో పాటు ఈ జనరేషన్‌లో కూడా తమని అర్థం చేసుకునే పార్ట్‌నర్ ఉండరని భావించి పెళ్లికి దూరంగా ఉంటున్నారు.

    స్వేచ్ఛకి అలవాటు పడి..
    ఈ కాలం యువత ఎలా ఉన్నారంటే.. ఇండిపెండెంట్‌గా, నచ్చినట్లు ఉండటానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఇతరుల మీద ఆధారపడకుండా వాళ్లకి నచ్చినట్లు ఉండాలని కోరుకుంటున్నారు. అదే పెళ్లి చేసుకుంటే నచ్చినట్లు లైఫ్ ఉండదని భావించి పెళ్లి చేసుకోవడం లేదు. అమ్మాయి లేదా అబ్బాయి అయిన ఇతరులకు నచ్చినట్లు ఎందుకు ఉండాలి? ఫ్రీడమ్ ఉండదని భావించి పెళ్లికి కాస్త దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా పెళ్లి చేసుకుని బాధలు పడటం కంటే ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

    పెళ్లి కాని వాళ్లని ఎలా చూస్తుందంటే?
    సమాజం ధోరణిలో ప్రతీ ఒక్కరూ పెళ్లి చేసుకోవాలి. సరైన వయస్సులో పెళ్లి చేసుకోకపోతే అసలు విలువ కూడా ఉండదు. పెళ్లి కాకపోతే జీవితంలో ఏదో పెద్ద తప్పు చేసినట్లు భావిస్తుంటుంది.