Jobs: ఈ మధ్య కాలంలో రాతపరీక్ష లేకుండా వరుసగా జాబ్ నోటిఫికేషన్లు రిలీజవుతూ ఉండగా ఈ జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్ టెన్షన్ మేనేజ్ మెంట్ నుంచి కన్సల్టెంట్ పోస్టుల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది.
మొత్తం 3ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. కన్సల్టెంట్ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని తెలుస్తోంది. https://www.manage.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు పూర్తి సమాచారంను తెలుసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్ లో పీహెచ్డీ లేదా పీజీ చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 42,000 రూపాయల చొప్పున వేతనం లభించనుంది. 2022 సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉందని సమాచారం అందుతోంది.
ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండనుంది. తక్కువ సంఖ్యలో పోస్టులు ఉండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. రాతపరీక్ష లేకుండా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.