https://oktelugu.com/

Valentine’s Day : మీ ఇంటినే “ప్రేమ” గా మార్చండి

ప్రేమను ఆవిష్కరించాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రేమను వ్యక్తీకరించాలంటే ఏదో చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనవాళ్లను ప్రేమిస్తే చాలు.

Written By:
  • NARESH
  • , Updated On : February 14, 2024 / 09:02 PM IST
    Follow us on

    Valentine’s Day : గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. అంటే గృహాన్ని ఎంత బాగా తీర్చిదిద్దుకుంటే అది ఆ స్థాయిలో స్వర్గమవుతుందని అర్థం. ఇక ఈ గృహాలను నిర్మించుకునే తీరు.. నిర్వహించుకునే తీరు.. వారి వారి ఆర్థిక సామర్థ్యాలను బట్టి ఉంటుంది. అయితే చాలామంది ఏదైనా వేడుకలు జరుపుకునేందుకు బయటకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. ఎప్పుడూ చూసిన ఇల్లే కాబట్టి, అందులో వేడుకలు జరుపుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. అయితే ఆ ఆసక్తిని కొంతలో కొంతైనా ఇంటి నిర్వహణ మీద చూపిస్తే బాగుంటుంది. అది మిమ్మల్ని ప్రేమించే వాళ్లకు మరింత బాగుంటుంది. ఈ ప్రేమికుల దినోత్సవం రోజున ఇంటిని ఎలా తీర్చిదిద్దుకుంటే బాగుంటుందో.. ఈ కథనంలో చూద్దాం.

    వంటగది

    వంటగది ఎంత బాగుంటే.. మనం తినే తిండి అంత బాగుంటుంది. వంట గదిలో ఆడవాళ్లు వంట చేసి అలసిపోతుంటారు. అలాంటప్పుడు వారి పాదాలు కందిపోకుండా కింద ఒక గ్రీన్ మ్యాట్ వేయండి. అన్ని వస్తువులు వారికి అందుబాటులో ఉండే విధంగా ఒక ఆల్మరా ఏర్పాటు చేయండి. వంటలో సహాయపడండి. వారికి మధ్య మధ్యలో పండ్ల రసాలు ఇస్తూ ఉండండి. ఆమెను అలా కూర్చోబెట్టి మీకు నచ్చిన వంట చేయండి. ఆమెను మహారాణి లాగా కూర్చోబెట్టి సర్వ్ చేయండి.

    పడకగది

    పడకగది ఎంత శుభ్రంగా ఉంటే దాంపత్య జీవితం అంత బాగుంటుంది. ప్రేమికుల రోజున పడకమీద మల్లెలు పరచండి. గులాబీ రేకులు చల్లండి. ఎయిర్ ఫ్రెషనర్ ఆన్ చేయండి. మెలోడీ పాటలు ఎక్కువ శబ్దం లేకుండా ఆమెకు వినిపించండి. ప్రేమలో పడ్డ నాటి సంగతులు ఒక్కొక్కటిగా ఆమెకు వివరించండి. ఆమె మెచ్చే లాగా రొమాంటిక్ కవితలు వినిపించండి.

    బాత్ రూం

    మన వ్యర్ధాలు మొత్తం వెళ్లేది అందులోకే కాబట్టి.. దానిని అత్యంత శుభ్రంగా ఉంచండి. వీలుంటే ఎయిర్ ఫ్రెషనర్ ఆన్ చేయండి. శుభ్రమైన నీటితో కడగండి. కొత్త క్రోమ్ టవల్స్ అందులో ఏర్పాటు చేయండి. వాష్ బేసిన్ వద్ద అలంకరణ వస్తువులు ఏర్పాటు చేయండి. ఇకనుంచి బాత్రూం శుభ్రం చేసే బాధ్యత నాదే అని ఆమెకు వాగ్దానం ఇవ్వండి.

    లాన్

    లాన్ లో అడ్డ దిడ్డంగా పెరిగిన పచ్చి గడ్డిని కత్తిరించండి. అందులో ఊగడానికి ఒక ఊయల ఏర్పాటు చేయండి. ఇద్దరు పక్కపక్కనే కూర్చుని కబుర్లు చెప్పండి. ఆమె తలను మీ ఒడిలోకి తీసుకుని హాయిగా మసాజ్ చేయండి. ఆమె ఆరోగ్యాన్ని పరిరక్షించే వాటర్ ప్యూరిఫైయర్ బహుమతిగా ఇవ్వండి. లేకుంటే వినసొంపైన సంగీతం అందించే హోమ్ థియేటర్ కానుకగా అందించండి. చీర లేదా విలువైన నగలు కూడా ఆమె మనసును దోచుకుంటాయి. వాటిని బహుమతులుగా ఇస్తే ఆమె మరింత మురిసిపోతుంది.

    స్థూలంగా చెప్పాలంటే ఇల్లు అనేది మన శాశ్వత చిరునామా. అందులో ఉండే భార్యాభర్తలు కూడా శాశ్వతానికి ప్రతీకలు. అలాంటప్పుడు జరిగే ప్రతి వేడుక అద్భుతంగా ఉండాలి. ఇద్దరికీ గుర్తుండిపోవాలి. అప్పుడే ప్రేమ బలపడుతుంది. దానికి ఇల్లు సాక్ష్యంగా నిలుస్తుంది. అందుకే ఇల్లును ప్రేమగా మార్చాలి అని చెప్పేది. చివరగా ఓ కేక్ ఆమెతో కట్ చేయించండి. ఓ ముక్క ఆమెకు ప్రేమగా తినిపించండి.. ప్రేమను ఆవిష్కరించాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రేమను వ్యక్తీకరించాలంటే ఏదో చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనవాళ్లను ప్రేమిస్తే చాలు.