Mahashivratri 2024 : ఈ మూడు మొక్కలు శివరాత్రి రోజు ఇంటికి తెచ్చుకుంటే పరమశివుడి అనుగ్రహం ఉన్నట్లే..

మహాశివరాత్రి ప్రధాన ఆచారాలలో ఒకటి శివలింగానికి నీరు,పాలతో అభిషేకం చేయడం. దీనిని రుద్రాభిషేకం అంటారు. ఇది భగవంతునిపై గౌరవం, కృతజ్ఞతను తెలియజేస్తుంది. శివుని ఆశీర్వాదం పొందేందుకు ఆయనకు ఇష్టమైన మొక్కలను ఇంటికి తెచ్చుకుంటారు. ఈ మూడు మొక్కలు ఇంటికి తెచ్చుకుంటే శివుని అనుగ్రహంతో జీవితాలు సంతోషంగా ఉంటాయని నమ్ముతారు.

Written By: NARESH, Updated On : March 4, 2024 6:29 pm
Follow us on

Mahashivratri 2024 : దేశమంతా మహాశివరాత్రికి సిద్ధమవుతోంది. పరమశివుడి అనుగ్రహం పొందేందుకు శివభక్తులు మహాశివరాత్రి రోజు జాగరణ చేస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. బోళాశంకరుడి అనుగ్రహం కోసం భక్తిభావం చాటుకుంటారు. శివరాత్రి రోజు ఉపవాసం పాటిస్తూ జాగరణ చేస్తే శివుడి అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. మార్చి 8న శివరాత్రి సందర్భంగా ఆరోజు మూడు మొక్కలు ఇంటికి తెచ్చుకుంటే శివుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

శివరాత్రి అంటే..
నిరాకారం నుంచి శరీర రూపం వరకు పరమ శివుడు అవతరించిన రాత్రిని మహా శివరాత్రి అంటారు. ఈ రాత్రి వేళ శివుడు లింగరూపంలో దర్శనమిచ్చాడు. అంతేకాదు పార్వతీ పరమేశ్వరుల కల్యాణం కూడా మహాశివరాత్రి రోజే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఇప్పటికే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శైవక్షేత్రాల్లో ప్రారంభమయ్యాయి.

పండుగ ప్రత్యేకతలు…
మహాశివరాత్రి ప్రధాన ఆచారాలలో ఒకటి శివలింగానికి నీరు,పాలతో అభిషేకం చేయడం. దీనిని రుద్రాభిషేకం అంటారు. ఇది భగవంతునిపై గౌరవం, కృతజ్ఞతను తెలియజేస్తుంది. శివుని ఆశీర్వాదం పొందేందుకు ఆయనకు ఇష్టమైన మొక్కలను ఇంటికి తెచ్చుకుంటారు. ఈ మూడు మొక్కలు ఇంటికి తెచ్చుకుంటే శివుని అనుగ్రహంతో జీవితాలు సంతోషంగా ఉంటాయని నమ్ముతారు.

మారేడు మొక్క..
పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మొక్కలలో మారేడు లేదా బిల్వపత్ర మొక్క ఒకటి. ఈ మొక్క ఆకు శివుడి మూడు కళ్లను సూచిస్తుంది. మహాశిరాత్రి రోజు శివుడిని సంతోషపెట్టడానికి మారేడు ఆకులతో పూజిస్తారు. ఆరోజు ఇంట్లో మారేడు మొక్కలు నాటినా లేదా శివపూజలో వాడిన ఆకులు ఇంట్లో పెట్టినా, ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.

సెంటుమల్లె చెట్టు..
శివుడికి సెంటుమల్లె చెట్టు లేదా అరేబియన్‌ జాస్మిన్‌ అంటే ఎంతో ఇష్టం. ఈ మొక్కకు పూసే పూలు అద్భుతమైన పరిమళాలతో ఉంటాయి. ఈపూలు శివుని సతీమని పార్వతికి చాలా ఇష్టం. మహాశిరాత్రి రోజు ఆ మొక్కను ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిదని అంటున్నారు పండితులు. అమ్మవారి ఆశీస్సులు కలుగుతాయని పేర్కొంటున్నారు.

ఉమ్మెత్త మొక్క..
ఉమ్మెత్త లేదా దత్తూర మొక్క. ఇది తెల్లటి పూలు, విషపూరితమైన గింజలతో పెరుగుతుంది. సాధారణంగా ఇంటిలో ఈ మొక్కలను పెంచుకోరు. కానీ మహాశిరాత్రి రోజు మాత్రం ఏరికోరి ఇంటికి తీసుకొస్తారు. ఈ పూలు శివుడికి చాలా ఇష్టం. ఈ పువ్వులు సమర్పించి శివుడికి దగ్గర కావొచ్చని పేర్కొంటున్నారు పండితులు. శివరాత్రి రోజన ఉమ్మెత్త మొక్క ఇంట్లో ఉంటే అదృష్టమని జోతిష్యులు పేర్కొంటున్నారు. ఈ మొక్క ఆనందం, సంపదను తెస్తుందని భక్తులు విశ్వసిస్తారు.