https://oktelugu.com/

Lungs : ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏవి తినాలి?

శరీరానికి ఆక్సిజన్ ను అందించడానికి ఊపిరితిత్తులు పనిచేస్తాయి. అలాంటి ఊపిరితిత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

Written By:
  • Srinivas
  • , Updated On : January 27, 2024 / 04:55 PM IST

    Lungs Helthy food

    Follow us on

    Lungs : మనిషి బతకడానికి గాలి అత్యంత ప్రధానం. కాసేపు శరీరంలోకి గాలి చొరబడకపోతే ప్రాణం ఆగిపోతుంది. అయితే శరీరంలోకి వెళ్లిన గాలిని స్వచ్ఛంగా తయారు చేస్తాయి ఊపిరితిత్తులు. శరీరానికి ఆక్సిజన్ ను అందించడానికి ఊపిరితిత్తులు పనిచేస్తాయి. అలాంటి ఊపిరితిత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నేటి కాలంలో చిరుతిళ్లు, నాణ్యతో లోపం ఉన్న ఆహారం తినడం వల్ల ఊపిరితిత్తులు వయసు మీదపడకముందే చెడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు ఎలాంటి హాని కలగకుండా ఉంటాయి. మరి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి?

    ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి. ఇది బ్రోకలీలో పుష్కలంగా ఉంటుంది. బ్రోకలీ ఇప్పుడిప్పుడే ఇండియన్ మార్కెట్లో ఎక్కువగా లభిస్తోంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండి శ్వాస తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు.

    బ్రకోలీతో పాటు క్యారెట్ కూడా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తాయి. క్యారెట్ లో విటమిన్ ఏ, సీ ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు గాలి లంగ్స్ లోకి చేరకుండా అడ్డుకుంటాయి. క్యారెట్ ను నేరుగా కాకుండా జ్యూస్ చేసుకొని తాగినా నయమేఅవుతుంది. అందువల్ల వీలైనప్పుడల్లా క్యారెట్ ను వివిధ రకాలుగా తీసుకోవచ్చు.

    వీటితో పాటు దానిమ్మ ను ఎక్కువగా తింటూ ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేయడానికి బాగా ఉపయోగపడుతాయి. దీంతో చెడు రక్తం తొలగిపోయి శ్వాస తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే పచ్చి బఠానీలు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమే ఇది తినడం వల్ల శరీరంలో ఎటువంటి ఇబ్బందులున్నా తొలగిస్తాయి. …